King Charles : కింగ్ చార్లెస్ కు పాస్ పోర్ట్ అక్క‌ర్లేదు

డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవ‌స‌రం లేదు

King Charles :  బ్రిట‌న్ రాణి ప్రిన్స్ ఎలిజ‌బెత్ 96 ఏళ్ల వ‌య‌స్సులో క‌న్ను మూశారు. ఆమె స్థానంలో రాజుగా (కింగ్ ) ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఆయ‌న జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.

అయితే కింగ్ గా కొలువు తీరాక ఆయ‌న ప్ర‌పంచంలోని ఏ దేశానికైనా నిర‌భ్యంత‌రంగా ప్ర‌యాణం చేవ‌చ్చు. ఇందుకు సంబంధించి చార్లెస్(King Charles) కు ఎలాంటి పాస్ పోర్ట్ అవ‌స‌రం లేదు.

అంతే కాదు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండ‌దు. ఈ రెండింటికి సంబంధించి ఎలాంటి రూల్స్ ఆయ‌న‌కు వ‌ర్తించ‌వు. ఇది ఒక్క కింగ్ కు మాత్ర‌మే ఈ సౌలభ్యం ఉంటుంది.

రాజ కుటుంబంలోని ఇత‌ర స‌భ్యుల మాదిరిగా కాకుండా అత‌డి పేరు మీద ప‌త్రం జారీ చేయ‌బ‌డుతుంది. అందుకే ఆయ‌న‌కు పాస్ పోర్ట్ అవ‌స‌రం లేదు.

కాగా కింగ్ చార్లెస్ ఇక నుంచి పాస్ పోర్ట్ లేకుండా జ‌ర్నీ చేస్తాడు. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తాడు. ఇంగ్లండ్ లోని అన్నింటిని ఆయ‌న క‌లిగి ఉంటారు. ఆయ‌న పేరు మీదే పాల‌న సాగుతుంది.

అంతే కాదు సంవ‌త్స‌రానికి రెండుసార్లు త‌న పుట్టిన రోజును జ‌రుపుకునే సంప్ర‌దాయాన్ని కొన‌సాగించ‌వ‌చ్చు. బ్రిట‌న్ లో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయ‌గ‌లిగిన ఏకైక వ్య‌క్తి రాజు మాత్ర‌మే కావ‌డం విశేషం.

కాఆ చార్లెస్ త‌ల్లి క్వీన్ ఎలిజబెత్ -2 (Queen Elizabeth II) కి రెండు పుట్టిన రోజులు ఉన్నాయి. ఏప్రిల్ 21న ఆమె అస‌లు పుట్టిన రోజు కాగా. ఇది ప్రైవేట్ గా జ‌రిగంది.

జూన్ లో రెండో మంగ‌ళ‌వారం అధికారికంగా బ‌హిరంగంగా జ‌రుపుకునే వేడుక‌. వేస‌వి వాతావ‌ర‌ణం బ‌హిరంగ క‌వాతుల‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ వేడుక‌లో 1,400 మందికి పైగా సైనికులు, 200 గుర్రాలు, 400 మంది సంగీత‌కారులు పాల్గొంటారు.

Also Read : క‌ళింగ‌’కు యునెస్కో పుర‌స్కారం

Leave A Reply

Your Email Id will not be published!