King Charles : ప్రిన్స్ ఎలిజ‌బెత్ స్థానంలో చార్లెస్

శోక సంద్రంలో యునైటెడ్ కింగ్ డ‌మ్

King Charles : సుదీర్ఘ కాలం పాటు యునైటెడ్ కింగ్ డ‌మ్ (బ్రిట‌న్ ) కు రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్ – 2 మ‌ర‌ణించారు. 96 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన ఆమె సెప్టెంబ‌ర్ 8న తుది శ్వాస విడిచార‌ని బ‌కింగ్ హామ్ ప్యాలెస్ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

క్వీన్ ఎలిజ‌బెత్ మ‌ర‌ణించ‌డంతో ఆమె స్థానంలో ఎవరు బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ప్ర‌స్తుతం చార్లెస్ ఆ స్థానాన్ని భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

త‌న త‌ల్లి క్వీన్ ఎలిజ‌బెత్ -2 వృద్దాప్య స‌మ‌యంలోనూ చార్లెస్ ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. అన్ని బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించాడు.

త‌న స్వంత మార్గాన్ని ఏర్ప‌ర్చు కోవ‌డం ద్వారా సింహాస‌నానికి ఎక్కువ కాలం ప‌ని చేసిన వార‌సుడిగా త‌న రికార్డు బద్ద‌లు కొట్టే స‌మ‌యాన్ని ఎక్కువ‌గా ఉప‌యోగించు కున్నాడు.

ఇది ఇలా ఉండ‌గా ఆయ‌న ఓ సారి త‌న ప‌ద‌వి గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇబ్బంది ఏమిటంటే ఉద్యోగ విర‌మ‌ణ లేదు. మ‌నంత‌కు మ‌న‌మే దానిని త‌యారు చేసుకోవాల‌ని పేర్కొన్నారు చార్లెస్(King Charles) .

ఆయ‌న అనేక విష‌యాల‌పై మాన‌వీయంగా చురుకుగా ఉంటారన్న పేరుంది. త‌ర‌చుగా రాడ‌ర్ లో ఉన్న‌ప్ప‌టికీ చార్లెస్ త‌న‌ను తాను ప్ర‌బ‌ల‌మైన రాజ‌కీయ ఏకాభిప్రాయానికి వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్న అస‌మ్మ‌తివాదిగా గుర్తింపు పొందారని చార్లెస్ కు వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడిగా ప‌ని చేసిన సైనికాధికారి వెల్ల‌డించారు.

చార్లెస్ త‌న త‌ల్లి ప్ర‌జ‌ల జీవితాల‌ను మెరుగు ప‌ర్చడంలో స‌హాయం చేయ‌డం త‌న క‌ర్త‌వ్యంగా భావించాడు. వాస్తు శిల్పం, ప‌ర్యావ‌ర‌ణం, వ్య‌వ‌సాయం, విశ్వాసం, ప్ర‌త్యామ్నాయ వైద్యం గురించి త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నాడు కూడా.

Also Read : మార‌నున్న ప‌ద‌వులు..హోదాలు

Leave A Reply

Your Email Id will not be published!