Kinnera Mogulaiah : దేశంలో అత్యున్నత పురస్కారాలుగా భావించే పద్మ అవార్డుల పరస్కారం జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎంపిక చేసిన వారికి అందజేశారు. 2022 సంవత్సరానికి వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ప్రదానం చేశారు.
8 మందికి పద్మ భూషణ్ , 54 మందికి పద్మశ్రీ అవార్డులు ఇచ్చారు. దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ , గీతా ప్రెస్ మాజీ చైర్మన్ రాధే శ్యామ్ ఖేమ్యా మరణాంతరం పద్మ విభూషణ్ ఇచ్చారు.
రావత్ కూతుర్లు కృతిక, తారిణి, ఖేమ్కా తనయుడు రాష్ట్రపతి నుంచి అవార్డులు అందుకున్నారు. కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు గులాం నబీ ఆజాద్ పద్మ భూషణ్ తీసుకున్నారు.
పారా ఒలింపిక్ విజేద ఝురియా, స్వామి సచ్చిదానంద, టాటసన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ , మాజీ కాగ్ చీఫ్ రాజీవ్ మెహ్రిషి , సీరం చైర్మన్ సైరన్ పూనావాలా పద్మ భూషణ్ పొందారు.
హాకీ ప్లేయర్ వందనా కటారియా, పారా షూటర్ అవనీ లేఖరా , స్వామి శివానంద, గరిక పాటి నరసింహారావు , కిన్నెర వాయిద్య కారుడు మొగులయ్య(Kinnera Mogulaiah )పద్మశ్రీ పురస్కారాలు స్వీకరించారు రాష్ట్రపతి నుంచి.
అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. 125 ఏళ్ల యోగా గురువు స్వామి శివానంద పురస్కారం అందుకునే ముందు ప్రధాని మోదీకి, రాష్ట్రపతి కోవింద్ కు పాదాభివందనం చేశారు.
దీంతో స్వామి శివానందకు ప్రధాని ప్రతి నమస్కారం చేశారు. ఇదిలా ఉండగా 128 అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈసారి సర్కార్ విదేశాలలో ఉన్న భారతీయులకు కూడా పురస్కారాలు అందజేసింది.
Also Read : తిరుమలలో పోటెత్తిన భక్తజనం