Kiran Kandolkar : దేశ రాజకీయాలను ఒంటి చేత్తో శాసిస్తూ వస్తున్న ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు గోవా టీఎంసీ చీఫ్ కిరణ్ కండోల్కర్(Kiran Kandolkar : ). ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో పీకే కు టీఎంసీకి పడడం లేదన్న విమర్శలు వచ్చాయి.
ఈ తరుణంలో పీకేకు, టీఎంసీతో ఎలాంటి ఇబ్బందులు లేవంటూ స్పష్టం చేసింది టీఎంసీ. ఇదే క్రమంలో తాజాగా గోవా రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ముగిశాయి. టీఎంసీ అక్కడ పోటీ చేసింది.
బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమిని ఏర్పాటు చేసే పనిలో పడ్డారు పీకే. అయితే గోవాలో టీఎంసీకి ఐపాక్ సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఐపాక్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ తో పాటు టీం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కిరణ్ కండోల్కర్.
ఏకంగా ఎన్నికలు ముగిసిన వెంటనే టీఎంసీ పార్టీ గోవా చీఫ్ కిరణ్ కండోల్కర్ తీవ్రంగా మండిపడ్డారు. పీకే వ్యవహారం ఏమంత బాగో లేదంటూ ఆరోపించారు. తాను తీవ్రంగా కలత చెందానని వాపోయాడు.
ఎన్నికల కంటే ముందు ఓ లాగా ఎన్నికలై పోయాక మరోలా వ్యవహరించారని సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాదు తమను అస్సలు పట్టించుకునన పాపాన పోలేదన్నారు.
తాను టీఎంసీ గోవా చీఫ్ పదవి వదులు కోవడం లేదని స్పష్టం చేశారు. అయితే ఐపాక్ హెడ్ పీకే , టీం పట్ల ఆగ్రహంతో ఉన్నానని చెప్పారు.
ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీ – ఎంజీపీతో పొత్తు పెట్టుకుని తృణమూల్ పోటీ చేసింది. కండోల్కర్ ఆల్టోనా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తే ఆయన భార్య కవిత థివిమ్ నుంచి బరిలో ఉన్నారు.
Also Read : అమిత్ చంద్ర షా సంచలన కామెంట్స్