Kiran Mazundar Shaw : మతవాదం లేదా మతోన్మాదం అత్యంత ప్రమాదకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రముఖ బయోకాన్ (Biocon) సంస్థ సిఇఓ కిరణ్ మజుందార్(Kiran Mazundar Shaw). ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
ఇప్పటికే బీజేపీ (BJP) శ్రేణులు మతాన్ని భుజం మీద మోస్తున్నారు. కర్ణాటకలో (Karnataka) మతం పేరుతో ఇబ్బందులు ఎక్కువై పోయాయి. ఇటీవలే హిజాబ్ వివాదం కన్నడ నాట గొడవలు, దాడులకు దారితీసింది.
ఈ తరుణంలో కర్ణాటక (Karnataka) హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. హిజాబ్ అన్నది మతం కాదని, అది ధరించాలని ఇస్లాం మతంలో లేదని స్పష్టం చేసింది ధర్మాసనం. దీనిని సవాల్ చేస్తూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆ కేసు ఇంకా విచారణకు రాలేదు. ఇదే సమయంలో ది కాశ్మీర్ ఫైల్స్ పేరుతో మూవీ వచ్చింది. ఇది ఊహించని రీతిలో హిట్ మూవీగా నిలిచింది. ఆశించిన దాని కంటే సక్సెస్ కావడం, రూ. 200 కోట్లు కొల్లగొట్టడం జరిగింది.
దీనిని బీజేపీ (BJP) శ్రేణులు తమ మూవీగా ప్రచారం చేసుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాలు ఆ మూవీకి వినోద పన్ను కూడా మినహాయింపులు ఇచ్చాయి. ఇదిలా ఉండగా సీరియస్ కామెంట్స్ చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.
ఆయన ఇంటిపై బీజేపీ (BJP) దాడులకు పాల్పడింది. ఈ తరుణంలో కమ్యూనలిజం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కిరణ్ మజుందార్(Kiran Mazundar Shaw). రాష్ట్రంలో పెరుగుతున్న మత విభజనను పరిష్కరించాలని కోరుతూ సీఎం బసవరాజ్ బొమ్మైని ఆమె కోరారు.
సాంకేతిక రంగం మత పరంగా మారితే అది భారత దేశ ప్రపంచ నాయకత్వాన్ని నాశనం చేస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : యడ్యూరప్పకు కోర్టు సమన్లు