Kiran Rijiju : నూపుర్ శ‌ర్మ‌పై కోర్టు తీర్పు కాదు ప‌రిశీల‌న

న్యాయ శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు కామెంట్స్

Kiran Rijiju : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించారు త‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికార ప్ర‌తినిధిగా ఉన్న నూపుర్ శ‌ర్మ‌. ఆమె చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

దేశంలో అల్ల‌ర్ల‌కు కార‌ణ‌మ‌య్యాయి. ఇదే స‌మ‌యంలో ఆమెకు స‌పోర్ట్ గా ట్వీట్ల్ చేసిన అనిల్ కుమార్ జిందాల్ పై బీజేపీ హై క‌మాండ్ చ‌ర్య‌లు తీసుకుంది. ఈ త‌రుణంలో దేశంలోని ప‌లు ప్రాంతాల‌లో నూపుర్ శ‌ర్మ‌పై ఫిర్యాదులు చేశారు.

ఆమెను అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ పెరుగుతోంది. ఈరోజు వ‌ర‌కు ఆమెను అరెస్ట్ చేయ‌లేదు. ఇదిలా ఉండ‌గా త‌న‌కు ప్రాణ భ‌యం ఉంద‌ని అన్ని కేసుల‌ను ఢిల్లీ ప‌రిధిలోకి తీసుకు వ‌చ్చేలా ఆదేశించాల‌ని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

దీనిపై విచార‌ణ జ‌రిపిన చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆమెకు ముప్పు కంటే నూపుర్ శ‌ర్మ వ‌ల్ల దేశానికి పెను ప్ర‌మాదం ఉంద‌న్నారు. నోరు అదుపులో పెట్ట‌క పోవ‌డం వ‌ల్ల ఇవాళ దేశం అగ్నిగుండంగా మారింద‌న్నారు.

బేష‌ర‌త్తుగా దేశానికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆదేశించారు. అధికారం ఉంది క‌దా అని ఎలా ప‌డితే అలా మాట్లాడ‌డం పై మండిప‌డ్డారు. దీనిపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు(Kiran Rijiju) స్పందించారు.

తాను సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పు, ప‌రిశీల‌న‌పై వ్యాఖ్యానించడం స‌రికాద‌న్నారు. తన‌కు తీవ్ర‌మైన అభ్యంత‌రాలు ఉన్న‌ప్ప‌టికీ మాట్లాడ‌న‌న్నారు.

అయితే త‌గిన ఫోర‌మ్ లో చ‌ర్చించేందుకు వీలుంటుంద‌న్నారు. ఇది మౌఖిక‌మైన ప‌రిశీల‌న మాత్ర‌మేన‌ని తీర్పు కాద‌ని చెప్పారు కిర‌ణ్ రిజిజు.

Also Read : దేశాన్ని ఏకం చేసే అంశాల‌పై దృష్టి పెట్టాలి

Leave A Reply

Your Email Id will not be published!