Kiran Rijiju : మేం ల‌క్ష్మ‌ణ రేఖ‌ను దాట లేదు

సుప్రీంకోర్టు తీర్పుపై కిర‌ణ్ రిజిజు

Kiran Rijiju : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. వివాదాస్ప‌ద దేశ ద్రోహ చ‌ట్టాన్ని ప్ర‌భుత్వం స‌మీక్షించింద‌ని దానిని నిలిపి వేస్తామ‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.

జైలులో ఉన్న వారు బెయిల్ కోసం కోర్టుల‌ను ఆశ్ర‌యించవ‌చ్చ‌ని , ఉగ్ర‌వాదం వంటి అభియోగాలు ప్ర‌మేయం ఉన్నందున విచార‌ణ కొన‌సాగించాల‌న్న కేంద్రం వాద‌న‌ను తోసి పుచ్చింది కోర్టు.

ఈ సంద‌ర్భంగా కోర్టు వెలువ‌రించిన ఉత్త‌ర్వులు వెలువ‌డిన కొద్ది కిర‌ణ్ రిజిజు(Kiran Rijiju) స్పందించారు. కోర్టుల ప‌ట్ల గౌర‌వం ఉంది. వాటి స్వ‌తంత్ర‌ను తాను గౌర‌విస్తాన‌ని చెప్పారు.

అయితే తాము ల‌క్ష్మ‌ణ రేఖ‌ను దాట‌లేద‌ని భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. ఇటీవ‌లే భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప్ర‌భుత్వం, కోర్టుల మ‌ధ్య ల‌క్ష్మ‌ణ రేఖ అన్న‌ది ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించాల‌న్నారు.

మా స్టాండ్ ఏమిటో స్ప‌ష్టంగా కోర్టుకు తెలియ చేశామ‌న్నారు మంత్రి. దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఏం అనుకుంటున్నారో కూడా వెల్ల‌డించామ‌న్నారు. ప్ర‌భుత్వం త‌న గీత‌ను దాట‌లేదు.

భార‌త రాజ్యాంగంలోని రూల్స్ ను అలాగే చ‌ట్టాల‌ను గౌర‌విస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశాం. ఇదే విష‌యాన్ని కోర్టుకు విన్న‌వించ‌డం జ‌రిగింద‌న్నారు. కిర‌ణ్ రిజిజు(Kiran Rijiju) బుధ‌వారం మీడియాతో మాట్లాడారు.

కోర్టు ప్ర‌భుత్వాన్ని, శాస‌న‌స‌భ‌ను గౌర‌వించాలి. ప్ర‌భుత్వం కూడా కోర్టు ప‌ట్ల సానుకూల ధోరణితో ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

మాకు స్ప‌ష్ట‌మైన స‌రిహ‌ద్దులు అనేవి ఉన్నాయ‌ని, ల‌క్ష్మ‌ణ రేఖ‌ను ఎవ‌రూ దాట కూడ‌ద‌న్నారు. దీనిని త‌ప్పు ప‌డుతున్నారా అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇవ్వ‌కుండా దాట వేవారు కిర‌ణ్ రిజిజు.

 

Also Read : నోరు జారిన సీఎం అమిత్ షానే పీఎం

Leave A Reply

Your Email Id will not be published!