ప్రస్తుతం న్యాయ వ్యవస్థకు కేంద్రానికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ వస్తోంది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికప్పుడు జడ్జీలు, ప్రధాన న్యాయమూర్తులు, రిటైర్డ్ అయిన జడ్జీలపై ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
సుప్రీంకోర్టు, హైకోర్టుల రిటైర్డ్ జడ్జీలకు సంబంధించిన ఫిర్యాదులను న్యాయ శాఖ నిర్వహించడం లేదని స్పష్టం చేశారు కిరెన్ రిజిజు. న్యాయమూర్తులపై ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. న్యాయ మంత్రిత్వ శాఖ సేవలందిస్తున్న సభ్యుల నియామకానికి మాత్రమే సంబంధించినదని పేర్కొన్నారు.
అయితే సర్వీస్ షరతులపై మాత్రమే న్యాయ మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర న్యాయ, న్యాయ శాఖ మంత్రి ప్రకారం కొంత మంది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు భారత దేశ వ్యతిరేక ముఠాలో భాగమేనా అన్న ప్రశ్నకు పై విధంగా కిరన్ రిజిజు సమాధానం ఇచ్చారు.
జాతీయ భద్రత దృష్ట్యా ప్రభుత్వం భారత దేశ ప్రధాన న్యాయమూర్తికి , కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమాచారం అందించిందా లేదా అనే సమాచారాన్ని వెల్లడించాలని అన్నారు.
పార్లమెంట్ లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పై విధంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు. ప్రస్తుతం కేంద్రం వర్సెస్ సీజేఐగా మారి పోయింది. ఈ తరుణంలో ఇలాంటి కామెంట్స్ చేయడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.