BKS Announces : డిసెంబ‌ర్ 19న కిసాన్ గ‌ర్జ‌న ర్యాలీ – బీకేఎస్

వ్య‌వ‌సాయ ప‌రిక‌రాలు, ఎరువుల‌పై జీఎస్టీ

BKS Announces :  కేంద్రంలో కొలువు తీరిన ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ప్ర‌ధానంగా బీజేపీకి అనుబంధంగా ఉంది భార‌తీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్ )(BKS Announces). విచిత్రం ఏమిటంటే కాషాయ సంస్థ యుద్దం ప్ర‌క‌టించ‌డం విశేషం. ఆర్ఎస్ఎస్, బీజేపీకి అనుబంధ సంస్థ‌గా ఉంది.

ప్ర‌ధానంగా బీకేఎస్ ఆరోపిస్తున్న‌ది ఒక్క‌టే. దేశంలోని వ్య‌వ‌సాయ రంగ ఉత్ప‌త్తుల‌పై జీఎస్టీ విధించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. ఈ మేర‌కు డిసెంబ‌ర్ 19న దేశ వ్యాప్తంగా బీకేఎస్ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ర్యాలీలు, నిర‌స‌న‌లు చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించింది.

ఇది ఒక ర‌కంగా మోదీ స‌ర్కార్ కు హెచ్చ‌రిక లాంటిదే. వ్యవ‌సాయ ఇన్ పుట్ ల‌పై జీఎస్టీకి వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించింది బీకేఎస్. అంతే కాకుండా ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధిని కూడా పెంచాల‌ని డిమాండ్ చేసింది మోదీ స‌ర్కార్ ను.

వ్య‌వ‌సాయ ప‌రికరాలు, ఎరువుల‌పై జీఎస్టీని ఎత్తి వేయాల‌ని కోరింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో బీకేఎస్ ర్యాలీ చేప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేసింది. బీకేఎస్ అఖిల భార‌త కార్య‌ద‌ర్శి కె. సాయిరెడ్డి ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. అక్టోబ‌ర్ 8, 9 తేదీల‌లో జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశం చేప‌ట్టారు.

రైతుల ఆర్థిక స్థిర‌త్వ‌మే ప్ర‌ధాన‌మ‌ని , అందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరింది బీకేఎస్. అక్టోబ‌ర్ , న‌వంబ‌ర్ నెల‌ల్లో ప్ర‌జ‌ల‌కు స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు , ర్యాలీ చేప‌ట్టేందుకు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని పేర్కొంది.

ఇన్ పుట్ ల ధ‌ర‌లు పెర‌గ‌డం వ‌ల్ల దేశంలో రైతుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింద‌న్నారు.

Also Read : విదేశీ ఆహార సంస్థ‌ల‌కు రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి

Leave A Reply

Your Email Id will not be published!