Kishan Reddy : తెలంగాణ సమాజం తలదించుకునేలా బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుంది
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని కిషన్రెడ్డి విమర్శించారు
Kishan Reddy : తెలంగాణలో గరిష్ఠ స్థానాలు కైవసం చేసుకునేందుకు బీజేపీ పక్కా వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇందులో భాగంగా జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభను నిర్వహించింది. జగిత్యాల విజయసంకల్ప సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) మండిపడ్డారు. తెలంగాణను దోచుకున్నది చాలదన్నట్టు మద్యం కుంభకోణంతో తెలంగాణకు చెడ్డపేరు తెచ్చారన్నారు. తెలంగాణ సమాజాన్ని నిలదీసేలా కేసీఆర్ కుటుంబం పని చేసిందన్నారు. రాష్ట్రంలో పదేళ్లుగా బీఆర్ఎస్ దోపిడీకి పాల్పడుతోందని, కేసీఆర్ కుటుంబం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందన్నారు. తెలంగాణను దోచుకున్నది చాలక… ఢిల్లీకి వెళ్లి లిక్కర్ స్కామ్ కి పాల్పడ్డారని విమర్శించారు.
Kishan Reddy Slams…
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని కిషన్రెడ్డి విమర్శించారు. 100 రోజుల్లో ఆరు హామీలను అమలు చేస్తామన్నారు. మొదటి, రెండో హామీలు అమలు చేశామని కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. గ్యారెంటీల కాంగ్రెస్ మోసమని విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని కిషన్రెడ్డి అన్నారు. ఆర్టికల్ 370 రద్దు నుంచి రామమందిర నిర్మాణం వరకు ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
Also Read : RS Praveen Kumar : సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్పి