Kishan Reddy : ప‌ర్యాట‌క రంగ అభివృద్దికి కృషి

బీజేపీ చీఫ్ జి. కిష‌న్ రెడ్డి పిలుపు

Kishan Reddy : హైద‌రాబాద్ – దేశంలో ప‌ర్యాట‌క రంగం విస్తృతంగా కొన‌సాగుతోంద‌ని అన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ , కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి. సోమ‌వారం ఆయ‌న హైద‌రాబాద్ లో జ‌రిగిన స‌ద‌స్సులో పాల్గొని ప్ర‌సంగించారు. హైద‌రాబాద్ లో ప‌ర్యాట‌క రంగం మ‌రింత అభివృద్ది సాధించేందుకు చాలా అవ‌కాశాలు ఉన్నాయ‌ని అన్నారు.

Kishan Reddy Comment

భార‌త దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రంగాల‌లో హాస్పిటాలిటీ, ప‌ర్యాట‌క రంగాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు కిష‌న్ రెడ్డి(Kishan Reddy). వ్యాపార‌స్తులు స‌ద‌రు రంగంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు.

త‌మ శాఖా ప‌రంగా ఇతోధికంగా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం దీనిపై ఎక్కువ‌గా దృష్టి సారించింద‌ని అన్నారు. ముఖ్యంగా ప‌ర్యాట‌క రంగంలో పెట్టుబ‌డుల‌కు భారత దేశాన్ని హాట్ స్పాట్ గా మార్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెప్పారు జి. కిష‌న్ రెడ్డి.

ఈ రంగానికి రాబోయే కాలంలో ఎలాంటి ఢోకా లేద‌న్నారు. ప‌బ్లిక్, ప్రైవేట్ భాగ‌స్వామ్యాల‌ను ప్రోత్స‌హించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు కేంద్ర మంత్రి.

Also Read : Nara Lokesh : పాల‌న అస్త‌వ్య‌స్తం రైతులు ఆగ‌మాగం

Leave A Reply

Your Email Id will not be published!