Kishan Reddy : అక్ర‌మార్కుల‌కు కేరాఫ్ కాంగ్రెస్

నిప్పులు చెరిగిన జి. కిష‌న్ రెడ్డి

Kishan Reddy : హైద‌రాబాద్ – అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారంతా ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి.(Kishan Reddy) ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్య స‌భ స‌భ్యుడు , భార‌త జోడో యాత్ర‌కు ఆర్థిక వ‌న‌రులు స‌మ‌కూర్చిన ధీర‌జ్ సాహూ అక్ర‌మంగా సంపాదించాడ‌ని, ఆయ‌న ఆస్తుల‌పై ఈడీ విచార‌ణ చేప‌ట్టింద‌న్నారు. ఈ దాడుల్లో కోట్లాది రూపాయ‌లు దొరికాయ‌ని ఆరోపించారు కిష‌న్ రెడ్డి.

Kishan Reddy Slams Congress Govt

అక్ర‌మ సంపాద‌న‌పై దాడులు చేస్తే కాంగ్రెస్ పార్టీ బాధ్యుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఎందుకు స్పందించ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు . ఇదేనా మీ సంస్కృతి అని నిల‌దీశారు. దేశ ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా ఉండాల్సిన స‌ద‌రు నేత నీతి వాక్యాలు వ‌ల్లించ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు కిష‌న్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీ త‌మ నేత‌లు, సీఎంల‌ను ఏటీఎంలుగా మార్చుకుంటోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అందుకే ప్ర‌జ‌ల నుండి దోచుకున్న లెక్క‌ల‌ను స‌రి చేసి వాటిని దేశాభివృద్దికి, ప్ర‌జా సంక్షేమానికి ఉప‌యోగిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు బీజేపీ చీఫ్‌, కేంద్ మంత్రి. రాష్ట్రంలో ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ ఒక్క‌టేన‌ని ఆరోపించారు. అందుకే అక్బ‌రుద్దీన్ ను ఏరికోరి ప్రొటెం స్పీక‌ర్ గా నియ‌మించార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : Yashashvini Reddy : అభివృద్ది అంటే ఏమిటో చూపిస్తా

Leave A Reply

Your Email Id will not be published!