మహేంద్ర సింగ్ ధోనీ సేన సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ నితీశ్ రాణా నాయకత్వంలోని కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆదివారం తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. ఇరు జట్లు బలంగా ఉన్నప్పటికీ చెన్నై పూర్తి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో టాప్ లో త్రీలో ఉంది. ప్లే ఆఫ్ రేస్ కు దాదాపు ఖరారైనట్టే. ఇక కేవలం నాలుగో స్థానానికి పోటీ నెలకొంది. లక్నో , రాజస్థాన్ , బెంగళూరు, పంజాబ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్ బలమైన ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ను ఓడించింది. కానీ ఆశించిన మేర విజయం దక్కించు కోలేక ఆఖరులో చతికిల పడింది. పాయింట్ల పరంగా 8వ స్థానంలో నిలిచింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ , ఢిల్లీ క్యాపిటల్స్ దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
ఇవాళ జరిగే మ్యాచ్ లో ఒక వేళ చెన్నై ఓడిపోయినా ఫరక్ పడదు. ఎందుకంటే పాయింట్ల రేసులో నిలిచింది. గెలిస్తే నెంబర్ 1కి చేరుకుంటుంది. లేదంటే ఓడి పోతే రెండో స్థానంతో సరి పెట్టుకుంది. కానీ గెలిచినా లేక ఓడినా కోల్ కతాకు ఒరిగేది ఏమీ ఉండదని తేలి పోయింది.