Kodali Nani : నా ఆరోగ్యానికి ఢోకా లేదు – కొడాలి నాని
బాబును రాజకీయ సమాధి చేస్తా
Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. తన ఆరోగ్యం బాగోలేదంటూ తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు. తాను భేషుగ్గానే ఉన్నానని , తన ఆరోగ్యానికి వచ్చిన ముప్పేమీ లేదన్నారు. కావాలని తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మంగళవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
దమ్ముంటే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. రాబోయే 2024లో జరిగే శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన అడ్రస్ లేకుండా పోతాయని ఎద్దేవా చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మెంటల్ ఆస్పత్రిలో చేర్చడం ఖాయమని జోష్యం చెప్పారు మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani).
తప్పుడు కూతలు కూస్తే తాట తీస్తానంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మరోసారి తమ ప్రభుత్వం మరోసారి పవర్ లోకి రావడం ఖాయమన్నారు. 175 సీట్లకు 175 సీట్లు తెచ్చుకునేందుకు తాము శాయ శక్తులా కృషి చేస్తామని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. బఫూన్ల మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు కొడాలి నాని.
ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా టీడీపీ ప్లాన్ వర్కవుట్ కాదన్నారు మాజీ మంత్రి. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుంటే బెటర్ అని సూచించారు.
Also Read : Congress Meeting : 20న కొల్లాపూర్ లో ప్రియాంక సభ
