Kodali Nani : వచ్చే 2024లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పవర్ లోకి వస్తామని కలలు కంటున్నారని వారి కలలు కల్లలు కావడం ఖాయమన్నారు మాజీ మంత్రి కొడాలి నాని.
తల కిందులు చేసినా వారు పవర్ లోకి రావడం జరగని పని అని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత తమ సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా సరే వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పవన్ కళ్యాణ్ ను ప్రజలు నాయకుడిగా పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు.
పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టడం వీరిద్దరికీ అలవాటుగా మారిందన్నారు కొడాలి నాని(Kodali Nani). చంద్రబాబు, పవన్ తలకిందులు చేసి తపస్సు చేసినా, యాగాలు చేపట్టినా అంత సీన్ లేదన్నారు.
2019లో నాలుగు పార్టీలను కలుపుకుని వ్యతిరేక ఓటు చీలకుండా చూశాననే పిచ్చి భ్రమలో పవన్ ఉన్నాడంటూ మండిపడ్డారు. చంద్రబాబు చెప్పినట్లు అవాకులు, చెవాకులు పేలుతున్న వారికి రాబోయే కాలంలో షాక్ తగలక తప్పదన్నాడు కొడాలి నాని.
ఇదే సమయంలో కలిసి వచ్చినా లేదా విడిగా వచ్చినా ఎంత మంది వచ్చినా ఢీకొనేందుకు ఇక్కడ జగన్ అనే సింహం రెడీగా ఉందన్నాడు కొడాలి నాని.
సంక్షేమ పథకాల అమలులో ఏపీ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. బాబు, పవన్ మాటలన్నీ అబద్దాలేనని తేలి పోయిందన్నారు. జనం పూర్తిగా జగన్ వైపు ఉన్నారని స్పష్టం చేశారు.
Also Read : రియాల్టీ షోలపై హైకోర్టు ఆగ్రహం