Kodali Nani : బాబు నిర్వాకం గొడ‌వ‌ల‌కు కార‌ణం

మాజీ మంత్రి కొడాలి నాని సీరియ‌స్

Kodali Nani vs Chandrababu : ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సీరియ‌స్ అయ్యారు. ఆయ‌న టీడీపీని మ‌రోసారి టార్గెట్ చేశారు. ఎవ‌రు నోరు జారారో ఎవ‌రు ఎవ‌రిపై దాడుల‌కు దిగారో ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌న్నారు. త‌మ‌కు స‌వాల్ విసిరేంత ద‌మ్ము, ధైర్యం చంద్ర‌బాబు నాయుడుకు లేద‌న్నారు. తండ్రీ కొడుకుల‌కు అంత సీన్ లేద‌న్నారు. ప‌ట్టాభిని ఉసిగొల్పింది, త‌మ పార్టీ ఆఫీసుపై తామే దాడులు చేసింది మీరు కాదా అంటూ నిల‌దీశారు.

ఈ మొత్తం ఎపిసోడ్ ను ర‌క్తి కట్టించేలా చేసింది చంద్రబాబేన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కొడాలి నాని. బాబు స‌వాళ్ల‌కు ప్రామాణిక‌త లేద‌న్నారు. పిచ్చి ప‌ట్టిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని , ప‌ద‌వి పోయినా ఇంకా సిగ్గు రాలేద‌న్నారు కొడాలి నాని(Kodali Nani vs Chandrababu). ద‌మ్ముంటే ముందు త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. అప్పుడు తెలుస్తుంది ఎవ‌రి ద‌మ్ము ఏమిటో అని ఎద్దేవా చేశారు.

ఊరికే మాట్లాడ‌టం ఆ త‌ర్వాత స‌వాళ్లు విస‌ర‌డం కేవలం ప‌బ్లిసిటీ స్టంట్ త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు కొడాలి నాని. ముందు త‌న‌కు ఉన్న బ్లాక్ క్యాట్ కమాండోలు వ‌ద్ద‌ని కేంద్రానికి చెప్పాల‌న్నారు. గ‌న్న‌వ‌రం పార్టీ ఆఫీసుపై దాడి చేయించింది చంద్ర‌బాబేన‌ని పేర్కొన్నారు. బాల‌య్య బాబు సినిమాల‌లో న‌టిస్తుంటే చంద్ర‌బాబు నాయుడు మైకుల్లో జీవిస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు కొడాలి నాని.

ప్ర‌శాంతంగా ఉన్న గ‌న్న‌వ‌రంలో చిచ్చు పెట్టింది నువ్వు కాదా అని ప్ర‌శ్నించారు. ప‌ట్టాభిని ఉసిగొల్పింది చంద్ర‌బాబు నాయుడేన‌ని ఆరోపించారు కొడాలి నాని.

Also Read : దాడి వెనుక అమృతపాల్ సింగ్

Leave A Reply

Your Email Id will not be published!