Kodali Nani YCP : తండ్రీ కొడుకుల‌కు అంత సీన్ లేదు

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కొడాలి నాని

Kodali Nani YCP : ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, కొడుకు నారా లోకేష్ ల‌ను ఏకి పారేశారు. శుక్ర‌వారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. తండ్రీ కొడుల‌కు అంత సీన్ లేద‌న్నారు. ఎన్ని యాత్ర‌లు చేసినా జ‌నం న‌మ్మే ప‌రిస్థితిలో లేరన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘ‌న‌త ఆ మ‌హానుభావుడిదేన‌ని ఎద్దేవా చేశారు. కొడుకు ఎందుకు చేస్తున్నాడో తండ్రి ఎందుకు తిరుగుతున్నాడో తండ్రీకొడుకుల‌కే తెలియ‌డం లేద‌ని మండిప‌డ్డారు.

జ‌గ‌న్ బ‌తికి ఉన్నంత వ‌ర‌కు ఆయనే ఏపీకి సిఎం గా ఉంటార‌ని జోష్యం చెప్పారు. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న ఘ‌న‌త ఏపీకే ద‌క్కుతోంద‌న్నారు. చంద్రబాబు, లోకేష్ ల‌ను జ‌నం ప‌క్క‌న పెట్టేశార‌ని కానీ వాళ్లే త‌మంత‌కు తాము గొప్ప‌లు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారంటూ మండిప‌డ్డారు కొడాలి నాని(Kodali Nani YCP). ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కావాల‌ని వ్య‌క్తిగ‌తంగా దూషిస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి.

రాజ‌కీయ ప‌రంగా నేరుగా ఎదుర్కోలేక వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేయ‌డం అల‌వాటుగా మారింద‌ని ఫైర్ అయ్యారు కొడాలి నాని. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎంత‌గా ప్ర‌య‌త్నం చేసినా ఈసారి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో వైసీపీనే మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు మాజీ మంత్రి. ప్ర‌జ‌లు పూర్తిగా త‌మ‌కే ప‌ట్టం క‌ట్టేందుకు సిద్దంగా ఉన్నార‌ని , ఎన్ని పార్టీలు క‌లిసినా త‌మ‌ను ఏమీ చేయ‌లేర‌ని అన్నారు కొడాలి నాని.

Also Read : మ‌హాసేన రాజేశ్ టీడీపీలో చేరిక

Leave A Reply

Your Email Id will not be published!