Kodandaram : భ‌ట్టితో కోదండ‌రాం భేటీ

విద్యుత్ సంక్షోభంపై చ‌ర్చ

Kodandaram : హైద‌రాబాద్ – తెలంగాణ జ‌న స‌మితి పార్టీ చీఫ్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం సోమవారం స‌చివాల‌యంలో రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు. ఇదే స‌మ‌యంలో విద్యుత్ సంస్థ‌లలో చోటు చేసుకున్న సంక్షోభం గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

Kodandaram Met with Bhatti Vikramarka

ఆర్థిక శాఖ తీరు తెన్నుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కొత్త‌గా కొలువు తీరిన స‌ర్కార్ ఆరు గ్యారెంటీల అమ‌లుపై ఫోక‌స్ పెట్టింద‌ని ఈ సంద‌ర్భంగా మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కోదండ‌రాంతో పేర్కొన్నారు. ఇప్ప‌టికే 2 గ్యారెంటీల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు.

ప్ర‌ధానంగా ఎలా గ‌ట్టెక్కాల‌నే దానిపై విస్తృతంగా చ‌ర్చించారు కోదండ‌రాం(Kodandaram). ఎన్నిక‌ల్లో భాగంగా తెలంగాణ జ‌న స‌మితి పార్టీ బ‌రిలో నిల‌వ‌లేదు. ఆయ‌న బేష‌ర‌తుగా కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చారు. ఆ మేర‌కు ప్ర‌తి స‌భ‌లోనూ పాల్గొన్నారు. ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేసేందుకు ప్ర‌య‌త్నం చేశారు.

గ‌త ప్ర‌భుత్వం ఎలా రాష్ట్రాన్ని దోచుకుందో ప్ర‌జ‌ల భాష‌ల్లో అర్థం చేసేందుకు కృషి చేశారు. చివ‌ర‌కు బీఆర్ఎస్ ఇంటికి వెళ్లేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు ప్రొఫెస‌ర్. మొత్తంగా స‌ర్కార్ బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచించారు కోదండ‌రాం. ఇక భ‌ట్టితో ఇవాళ భేటీ అయిన వారిలో విశ్వేశ్వ‌ర్ రావు, భైరి ర‌మేష్‌, న‌ర్స‌య్య ఉన్నారు.

Also Read : Salaar Movie : మూడు రోజులు రూ. 402 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!