Salaar Movie : మూడు రోజులు రూ. 402 కోట్లు

ప్ర‌భాస్ స‌లార్ మూవీ సునామీ

Salaar Movie : డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్ , శ్రుతీ హాస‌న్ క‌లిసి న‌టించిన స‌లార్ చిత్రం దుమ్ము రేపుతోంది. విడుద‌లైన తొలి షో నుంచే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. ఏకంగా మూడు రోజుల‌లోనే రూ. 402 కోట్లు వ‌సూలు సాధించింది. గ‌తంలో క్రియేట్ చేసిన రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లు చేసింది ఈ చిత్రం.

Salaar Movie Collections

ఇప్ప‌టికే ప్ర‌శాంత్ నీల్ తీసిన య‌శ్ కేజీఎఫ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఆ త‌ర్వాత ప్ర‌భాస్ తో తీసిన స‌లార్(Salaar) ఊహించ‌ని రీతిలో కాసుల‌ను కొల్ల‌గొట్టింది. రోజు రోజుకు క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతూ దూసుకు పోతోంది. అద్భుత‌మైన స్క్రీన్ ప్లే తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి పడేశాడ‌ని సీనీ పండితులు ఇప్ప‌టికే పేర్కొన్నారు.

ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ. 400 కోట్ల‌ను దాట‌డం ప్ర‌తి ఒక్క‌రినీ , ప్ర‌త్యేకించి సినీ రంగానికి చెందిన టెక్నీషియ‌న్స్, న‌టీ న‌టులు, ద‌ర్శ‌కులు విస్మ‌యం వ్య‌క్తం చేశారు స‌లార్ స‌క్సెస్. బ్లాక్ బ్ల‌స్ట‌ర్ మూవీగా రికార్డ్ బ్రేక్ చేసింది .

భార‌త దేశ సినీ చ‌రిత్ర‌లో స‌లార్ సృష్టిస్తున్న హ‌వా అంతా ఇంతా కాదు. థియేట‌ర్ల వ‌ద్ద డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ సంబురాల‌లో మునిగి పోయారు. ఎక్క‌డ చూసినా ప్ర‌భాస్ భారీ క‌టౌట్లు ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. ప్ర‌త్యేకించి మ‌రాఠాను స‌లార్ షేక్ చేస్తోంది.

Also Read : KA Paul : ప‌వ‌ర్ స్టార్ కు పాల్ పిలుపు

Leave A Reply

Your Email Id will not be published!