Siraj Kohli : కోహ్లీ ఎల్ల‌ప్పటికీ సూప‌ర్ హీరో

భార‌త పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్

Siraj Kohli  : భార‌త పేస‌ర్ హైద‌రాబాదీ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ(Siraj Kohli )టెస్టు జ‌ట్టు కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవ‌డంపై స్పందించాడు. విరాట్ కోహ్లీ లాంటి అద్భుత‌మైన ఆట‌గాడితో ఆడ‌డం త‌న అదృష్టంగా పేర్కొన్నాడు సిరాజ్.

మీరు ఎల్ల‌ప్పుడూ నా కెప్టెన్ గా ఉంటాడ‌ని కితాబు ఇచ్చాడు. త‌న‌పై న‌మ్మ‌కం ఉంచ‌డ‌మే కాక ఎల్ల‌ప్పుడూ వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించిన మీకు ఎంత‌గానో రుణ‌ప‌డి ఉన్నాన‌ని తెలిపాడు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అభిప్రాయాన్ని పంచుకున్నాడు. మీతో క‌లిసి ఎన్నో మ్యాచ్ లు ఆడే అవ‌కాశం, అదృష్టం క‌లిగింద‌న్నాడు. కోహ్లీ సార‌థ్యంలో భార‌త్ ఎన్నో అపురూప‌మైన విజ‌యాలు సాధించింద‌ని గుర్తు చేసుకున్నాడు.

కొన్ని గెలుపుల్లో తాను కూడా ఉండ‌డం అత్యంత ఆనందాన్ని, సంతోషాన్ని క‌లిగించింద‌ని పేర్కొన్నాడు సిరాజ్(Siraj Kohli ). కోహ్లీ స‌ర్ మీరు ఎల్ల‌ప్ప‌టికీ నా కెప్టెన్ అంటూ కితాబు ఇచ్చాడు.

మీరు క‌ల‌కాలం ఇలాగే సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపాడు. మీరు నాకు నాయ‌కుడిగానే కాదు నాకు సోద‌రుడి లాంటి వార‌ని అన్నాడు మ‌హమ్మ‌ద్ సిరాజ్.

కాగా కోహ్లీ సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి నిష్క్ర‌మించ‌డంపై తాజా, మాజీ ఆట‌గాళ్లు విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ఇది ఎవ‌రూ ఊహించ‌ని నిర్ణ‌య‌మ‌ని పేర్కొన్నారు.

ఇంత త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకుంటాడ‌ని ఎవ‌రూ అనుకోలేద‌న్నాడు సిరాజ్. ఏది ఏమైనా కోహ్లీ మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ కెప్టెన్ గా అభివ‌ర్ణించాడు.

ప్ర‌స్తుతం కోహ్లీ దేశ క్రికెట్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. అత‌డు త‌ప్పు కోవ‌డం వెనుక బీసీసీఐ చీఫ్ దాదా ఉన్నాడ‌నేది అత‌డి అభిమానుల ఆరోప‌ణ‌.

Also Read : వారిద్ద‌రు కొన‌సాగ‌డం క‌ష్టం

Leave A Reply

Your Email Id will not be published!