Kolkata RG Kar Case : ఆర్జీకర్ డాక్టర్ హత్య కేసులో అంతుచిక్కని మరో కొత్త డిఎన్ఏ
దీంతో, ఈ DNA పొరపాటున కలిసిందా?..
Kolkata RG Kar : ఆర్జీకర్ డాక్టర్ హత్య కేసులో కొన్ని కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సంజయ్ రాయ్‌కు జీవితఖైదు విధించడం పై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగగా, బెంగాల్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో తీవ్రంగా స్పందిస్తోంది. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కోర్టుకు సమర్పించిన రిపోర్టులో, వైద్యురాలి మృతదేహంపై మరో మహిళ యొక్క DNA గుర్తించబడటం చర్చనీయాంశమైంది. రిపోర్టు ప్రకారం, సంజయ్ రాయ్ యొక్క DNA మృతురాలి శరీరంపై 100 శాతం ఉండగా, మరికొంత స్ధాయిలో మరో మహిళ DNA కూడా కనిపించింది. దీంతో, ఈ DNA పొరపాటున కలిసిందా? లేదా ఆ మహిళ కూడా ఈ నేరంలో భాగమైందా? అనే అనుమానాలు పెరుగుతున్నాయి.
Kolkata RG Kar Case Updates
ఇదిలా ఉండగా, జూనియర్ వైద్యురాలి తండ్రి మరికొంతమంది వ్యక్తులు కూడా ఈ కేసులో ప్రమేయం ఉన్నారని ఆరోపణలు చేస్తున్నారు. తన కూతురి గొంతుపై గాయాలున్నా, స్వాబ్ సేకరించకపోవడం, మరియు CBI కేసును సరిగా పరిష్కరించడంలో వైఫల్యం చూపుతోందని ఆయన తెలిపారు. ఈ ఘటనలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు జోడీగా ఉన్నట్లు DNA రిపోర్టులో వెల్లడైందని అధికారులు తెలిపారు. 2024, ఆగస్టు 9న జరిగిన హత్యాచార ఘటనలో ఆస్పత్రి CCTV ఫుటేజీ ఆధారంగా సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన తరువాత, న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది.
Also Read : Covid 19-PM Modi : కరోనా కష్టకాలంలో అనాథలైన పిల్లలకు అండగా ప్రధాని