Komatireddy Raja Gopal Reddy : బీజేపీకి కోమటిరెడ్డి రిజైన్

కాంగ్రెస్ లో చేరుతున్నా

Komatireddy Raja Gopal Reddy : హైద‌రాబాద్ – తెలంగాణలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ భార‌తీయ జ‌న‌తా పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. ఇటీవ‌లే బీజేపీ తీర్థం పుచ్చుకుని మునుగోడులో బ‌రిలోకి దిగి ఓట‌మి పాలైన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి తిరిగి స్వంత గూటికి చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ మేర‌కు పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Komatireddy Raja Gopal Reddy Comment

ఇందుకు సంబంధించి సుదీర్ఘ లేఖ రాశారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంద‌న్నారు.

ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోందని తెలిపారు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి(Komatireddy Raja Gopal Reddy). ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగిన బిజెపి, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడిందని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఇప్పుడు రాష్ట్ర ప్ర‌జానీకం అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను భావిస్తున్నారని. అందుకే తాను కూడా ఇక్క‌డి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే.

Also Read : Goddess Of Law Comment : జూలు విద‌ల్చ‌ని న్యాయ వ్య‌వ‌స్థ

Leave A Reply

Your Email Id will not be published!