Komatireddy Venkat Reddy : డిపాజిట్ వస్తే పేరు మార్చుకుంటా
మంత్రి జగదీశ్ రెడ్డిపై కోమటిరెడ్డి ఫైర్
Komatireddy Venkat Reddy : హైదరాబాద్ – మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ మంత్రి గుండ్లకట్ల జగదీశ్వర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఈసారి జరగబోయే శాసన సభ ఎన్నికల్లో గనుక సూర్యాపేటలో మంత్రికి డిపాజిట్ గనుక వస్తే తాను తన పేరు మార్చుకుంటానని సంచలన ప్రకటన చేశారు.
Komatireddy Venkat Reddy Slams Minister Jagadeeshwar Reddy
అధికారాన్ని అడ్డం పెట్టుకుని, మంత్రి పదవిని ఆసరాగా చేసుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. తెలంగాణ పేరుతో ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తారంటూ మండిపడ్డారు. పాలన పడకేసిందని, సీఎం ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందుకు ప్రధాన సాక్ష్యం తుక్కుగూడలో నిర్వహించిన సభకు వచ్చిన జనమే నిదర్శనమన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని దానిని మరిచి పోయిన కేసీఆర్ ఫ్యామిలీ అవాకులు చెవాకులు పేలుతోందంటూ ధ్వజమెత్తారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఇక జగదీశ్ రెడ్డికి సూర్యాపేట ప్రజలు చుక్కలు చూపించడం ఖాయమన్నారు.
Also Read : Bandaru Satyanarayana Comment : వ్యక్తిత్వ హననం జుగుస్సాకరం