Komatireddy Venkat Reddy : కేసీఆర్ పై ఫోకస్ బాబు డోంట్ కేర్
మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy : హైదరాబాద్ – మాజీ మంత్రి, భువనగరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. తాను టీడీపీ చీఫ్ , మాజ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి పట్టించు కోనని అన్నారు. అది తమకు సంబంధించిన అంశం కాదన్నారు. ఆయనకు సంబంధించిన వార్తలు వస్తే స్విచ్ ఆఫ్ చేస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Komatireddy Venkat Reddy Comments Viral
తమ ఫోకస్ అంతా ప్రస్తుతం బీఆర్ఎస్ పై, ఆ పార్టీ బాస్, సీఎం కేసీఆర్ పై ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ గెలవబోతోందని జోష్యం చెప్పారు. ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఏర్పడిందని, సంక్షేమ పథకాల పేరుతో ఇన్నాళ్లు మోసం చేస్తూ వచ్చిన కేసీఆర్ కు చుక్కలు చూపించడం ఖాయమన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
తమ యుద్దం దొరతో, ఆయన అపసవ్య పాలనపైనేని పేర్కొన్నారు. తమ పార్టీలో టికెట్లు అమ్ముకుంటున్నారని వస్తున్న ఆరోపణలను కొట్టి పారేశారు. ఇదంతా కావాలని ఎవరు చేయిస్తున్నారో తమకు తెలుసన్నారు.
ఇదే సమయంలో తమ పార్టీపై కామెంట్స్ చేసిన మంత్రి హరీశ్ పై మండిపడ్డారు. ముందు నీ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసు కోవాలన్నారు.
Also Read : Kotha Manohar Reddy : రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలి