Komatireddy Venkat Reddy : ఆరు గ్యారెంటీల వైపు జనం చూపు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్
Komatireddy Venkat Reddy : అలంపూర్ – కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోందని తాము కనీసం 80 సీట్లు గెలవడం ఖాయమని జోష్యం చెప్పారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy). ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అలంపూర్ నియోజకవర్గంలో జరిగిన భారీ బహిరంగ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఖర్గే మాట్లాడిన అనంతరం కోమటిరెడ్డి ప్రసంగించారు.
Komatireddy Venkat Reddy Comment
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సర్కార్ ను ఏకి పారేశారు. తాము అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారెంటీల వైపు జనం చూస్తున్నారని తమ గెలుపును గులాబీ తట్టుకోలేదన్నారు. జనం మార్పు కోరుకుంటున్నారని, హస్తం అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.
తొమ్మిదిన్నర ఏళ్ల పాటు పాలించిన కేసీఆర్ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పవర్ లోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలకు సంబంధించి సంతకాలు చేస్తామన్నారు.
సీఎం అభ్యర్థి ఎవరనేది పార్టీ హైకమాండ్ చూసుకుంటుందన్నారు. కర్ణాటకలో తమ ప్రభుత్వం అన్ని రకాలుగా మన్ననలు అందుకుంటోందన్నారు. ఇచ్చిన 5 హామీలను అమలు చేస్తోందని చెప్పారు. ఇక బీఆర్ఎస్ కు గడ్డు కాలం నడుస్తోందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Also Read : Akbaruddin Owaisi : అక్బరుద్దీన్ బెదిరింపు పై కేసు నమోదు