Komatireddy Venkat Reddy : ప్రధానితో సమస్యలు ప్రస్తావించా
ఇందులో ఎలాంటి రాజకీయం లేదు
Komatireddy Venkat Reddy : భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ ముగిసింది. శుక్రవారం ఆయన ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సర్వత్రా నెలకొన్న ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేశారు ఎంపీ. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను మాత్రమే ప్రస్తావించానని ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు. తాను ఎవరికీ గులాంను కానని పేర్కొన్నారు. ఒక ఎంపీగా నాకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. పార్టీలు వేరు, సమస్యలు వేరు. నా ప్రజలకు ఏం కావాలో, నేను నా పరంగా ఏం చేయాలనే దానిపై పూర్తిగా నాకు మాత్రమే అవగాహన ఉంటుంది.
అందుకే లోక్ సభ నియోజకవర్గంలో పేరుకు పోయిన సమస్యల గురించి పీఎం దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పీఎంను కలిసిన అనంతరం ఆయన మీడియాతో(Komatireddy Venkat Reddy) మాట్లాడారు. తాను చెప్పిన ప్రతి అంశాన్ని కూలంకుశంగా నరేంద్ర మోదీ విన్నారని, సాధ్యమైనంత త్వరలో వాటన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని తనకు హామీ ఇచ్చారని తెలిపారు.
తామిద్దరి మధ్య దాదాపు 20 నిమిషాలకు పైగా చర్చ జరిగిందని వెల్లడించారు ఎంపీ. గుజరాత్ లోని సబర్మతి నదిని ఎలా కాలుష్యం లేకుండా చేశారో మూసీ నదిని అలా మార్చమని కోరానని తెలిపారు. అంతే కాకుండా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు అనుమతి ఇవ్వాలని కోరానని చెప్పారు.
ప్రస్తుతం తాను ఏ కమిటీలో లేనని పేర్కొన్నారు ఎంపీ. ఇక రాజకీయాల్లో కొనసాగుతానా లేదా అన్నది త్వరలోనే తేలుతుందన్నారు.
Also Read : కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ దుకాణం