Komatireddy Venkat Reddy : వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
50 సీట్ల కంటే తక్కువ వస్తే ప్రమాదం
Komatireddy Venkat Reddy : హైదరాబాద్ – భువనగరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ ఛానల్ తో జరిగిన చర్చా గోష్టిలో పాల్గొన్నారు. పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
Komatireddy Venkat Reddy Comments Viral
త్వరలో జరగబోయే ఎన్నికలు ప్రజల తెలంగాణకు దొరల తెలంగాణకు మధ్య కొనసాగుతోందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని , కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు.
119 సీట్లకు గాను తమ పార్టీకి 59 సీట్ల కంటే తక్కువ వస్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎందుకంటే ఏ మాత్రం తక్కువ వస్తే బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యే అవకాశం లేక పోలేదని అభిప్రాయపడ్డారు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) చేసిన ఈ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
అందుకే తమ పార్టీ అత్యంత జాగ్రత్త పడుతోందని, ప్రతి ఒక్కరిని పరిశీలించిన తర్వాతే టికెట్లను ఖరారు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అసలైన పోరు ప్రారంభమైందన్నారు. ఇక ప్రజల్లో పూర్తిగా కేసీఆర్ పట్ల నమ్మకం పోయిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనన్నారు.
Also Read : Minister KTR : డీకే శివకుమార్ కుట్ర నిజం