Komatireddy Venkatreddy : కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని నమ్మ వద్దన్నారు. ఇవాళ కోమటిరెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు.
కొన ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటానని, తన శరీరంపై తెలంగాణ జెండా కప్పాలని భావోద్వేగంతో అన్నారు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై స్పందించారు.
పార్టీ అన్నాక గొడవలు అనేవి ఉంటాయని , త్వరలోనే సర్దుకుంటాయని చెప్పారు. కేసీఆర్ గనుక పది రోజులు ఆస్పత్రిలో ఉంటే టీఆర్ఎస్ లో కొట్టుకు చస్తారంటూ సంచలన(Komatireddy Venkatreddy) కామెంట్స్ చేశారు.
తాను ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు కాదన్నారు. తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణిలో చోటు చేసుకుంటున్న అక్రమాల పై తాను పీఎంకు వివరించానని తెలిపారు.
దీంతో సీఎం కేసీఆర్ ఫ్యామిలీ చేస్తున్న ఆగడాలు, అవినీతి గురించి ఫిర్యాదు చేశానని ఆధారాలతో సహా చెప్పారు కోమటిరెడ్డి. కరోనా కాలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కానీ ఈరోజు వరకు కౌలు రైతులకు సాయం అందలేదన్నారు.
కేసీఆర్ మాట్లాడేవన్నీ అబద్దాలేనని మండిపడ్డారు. 3 వేల కోట్లు కేటాయించి మూసీ ప్రక్షాళన చేయాలని ప్రధానిని కోరానని తెలిపారు. రైతు బంధు వల్ల అసలైన రైతులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల కోసం ప్రధానిని, కేంద్ర మంత్రులను కలుస్తానని కుండ బద్దలు కొట్టారు.
Also Read : జగ్గారెడ్డికి టీపీసీసీ బిగ్ షాక్