Komatireddy Venkatreddy : నా జోలికి వస్తే నీ చిట్టా విప్పుతా
కేటీఆర్ పై కోమటిరెడ్డి ఆగ్రహం
Komatireddy Venkatreddy : కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkatreddy) నిప్పులు చెరిగారు. ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమిటరెడ్లు కాదు కోవర్టు రెడ్లు అంటూ వ్యాఖ్యానించారు. ఎవరు కోవర్టులో ప్రజలకు తెలుసన్నారు.
తాను ఏనాడూ పదవుల కోసం పాకులాడ లేదన్నారు. కోమటిరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో తాను పాల్గొన్న విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా దూషించడం మంచి పద్దతి కాదన్నారు. ప్రత్యేక రాష్ట్ర పోరాట సమయంలో మంత్రి పదవిని వదులుకున్న వ్యక్తిని తాను అని చెప్పారు.
మునుగోడులో ప్రస్తుతం పోటీ జరుగుతోంది. ఎవరైనా తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేసుకోవచ్చు. కానీ వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడటం కేటీఆర్ కు మంచిది కాదన్నారు. మమ్మల్ని అనే కంటే ముందు నీ చెల్లెలు కవిత అరెస్ట్ కాకుండా చూసుకో అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
రూ. 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు తీసుకున్నారంటూ ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సోదరుడు అయినంత మాత్రాన ఎవరి పార్టీ వారిదేనని పేర్కొన్నారు. తనను పార్టీ నుంచి బయటకు వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు.
కానీ తాను ఎక్కడికీ వెళ్లనని పార్టీలోనే ఉంటానని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkatreddy). ఒకవేళ ఇలాగే మాట్లాడుతూ పోతే నీ చిట్టా విప్పాల్సి వస్తుందని హెచ్చరించారు భువనగిరి ఎంపీ.
Also Read : వాళ్లు కోవర్టు రెడ్లు – కేటీఆర్ సెటైర్