Raj Gopal Reddy : హైదరాబాద్ – రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. పలు సర్వే సంస్థలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరా హోరీ పోరు ఉంటుందని , చివరకు హస్తం హవా కొనసాగే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నాయి. దీంతో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. ఆ పార్టీలో టికెట్లు రాని వాళ్లను, అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడింది. వారందరినీ గంప గుత్తగా బీఆర్ఎస్ లోకి ఆహ్వానించే పనిలో పడింది. ఈ వర్క్ అంతా దగ్గరుండి చూసుకుంటున్నారు కొడుకు, అల్లుడు కేటీఆర్, హరీశ్ రావు.
Raj Gopal Reddy Comment Viral
ఇక కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీ లోకి జంప్ అయి, ఓవర్ కాన్ఫిడెన్స్ తో తన పదవికి రాజీనామా చేశారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి(Raj Gopal Reddy). ఆ తర్వాత కేసీఆర్ స్కెచ్ లో బొక్క బోర్లా పడ్డాడు. ఇక బీజేపీలో తనకు ప్రయారిటీ దక్కడం లేదంటూ మళ్లీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నాడు. 48 గంటల్లోనే తిరిగి పార్టీ నుండి టికెట్ తెచ్చుకుని అందరినీ విస్తు పోయేలా చేశాడు.
చివరకు తాను రాజీనామా చేయడం వల్లనే మునుగోడు అభివృద్ది చెందిందంటూ కొత్త రాగం అందుకున్నాడు. తాజాగా మార్గదర్శి కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీ రావు ను కలుసుకున్నారు. ఇదంతా కేవలం భేటీ మాత్రమేనని పేర్కొంటున్నారు రాజగోపాల్ రెడ్డి.
Also Read : Pawan Kalyan : బాబు అనుభవం రాష్ట్రానికి అవసరం