Konchok Stanzin : కొంచక్ స్టాంజిన్ షాకింగ్ కామెంట్స్
భారత భూభాగం చైనా పరమని ఫైర్
Konchok Stanzin : భారత్, చైనా దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం ఎట్టకేలకు ఇరు దేశాల దళాలు ఉపసంహరణతో ముగిశాయని సంబుర పడుతున్నాం.
కానీ అందుకు భిన్నంగా ఉందంటూ అసలు నిజాన్ని బయట పెట్టారు లడక్ అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ కు చెందిన కౌన్సిలర్ కొంచక్ స్టాంజిన్(Konchok Stanzin).
లఢక్ లోని గోగ్రా – హాట్ స్ప్రింగ్ పెట్రోలింగ్ పాయింట్ 15 నుంచి బలగాలను ఉపసంహరించాయి. భారత భూభాగాన్ని చైనాకు ధారాదత్తం చేయడం వల్లే ఇది సాధ్యమైందంటూ ష్టాంజిన్ సంచలన ఆరోపణలు చేశారు.
పెట్రోలింగ్ పాయింట్ 15 నుంచే కాకుండా పెట్రోలింగ్ పాయింట్ 16 నుంచి కూడా రెండు దేశాల బలగాలు వెనక్కి తగ్గాయంటూ వాపోయారు. పీపీ 16 పూర్తిగా భారత దేశానికి చెందినది.
ఇక్కడ కొన్నేళ్లుగా భారత ఆర్మీ సైనిక పోస్ట్ ను నిర్వహిస్తూ వస్తోందన్నారు. అంతే కాకుండా సమీపంలో ఉన్న క్రుగ్యాంగ్ లోయలో స్థానికులు పశువులు మేపు కొనే వారని కానీ ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం బఫర్ జోన్ (డేంజర్ జోన్ ) గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు స్టాంజిన్(Konchok Stanzin).
ఇక కొంచక్ లేవనెత్తిన ప్రశ్నల్ని ఉదహరించారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ. కేంద్ర సర్కార్ 1000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని అప్పనంగా చైనాకు అప్పగించిందంటూ ధ్వజమెత్తారు.
ఎలాంటి పోరాటం చేయకుండానే ఇచ్చేసిన ఆ విలువైన స్థలాన్ని ఇప్పుడు ఎలా స్వాధీనం చేసుకుంటారో దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : పాకిస్తాన్ లోనే మౌలానా మసూద్ అజర్