Konda Surekha: ఎంజీఎం ఆసుపత్రిలో మంత్రి కొండా సురేఖ పర్యటన !

ఎంజీఎం ఆసుపత్రిలో మంత్రి కొండా సురేఖ పర్యటన !

Konda Surekha: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మంత్రి కొండా సురేఖ శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎంజీఎం ఆసుపత్రిలో నూతనంగా ఉద్యోగంలో చేరిన స్టాఫ్ నర్స్‌ లకు మంత్రి టోపీలు ధరింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ(Konda Surekha) మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. నర్సింగ్ ఉద్యోగాన్ని ప్రజలకు సేవచేయడానికి సద్వినియోగం చేసుకోవాలని కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి సూచించారు. పేదల ఆసుపత్రికి వచ్చిన రోగులకు అంకిత భావంతో సేవలు అందించాలని అన్నారు. గత ప్రభుత్వంలో వేతనాలు అందక కొంతమంది ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారని… 10 సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఉద్యోగులను కూడా పట్టించుకోలేదని విమర్శించారు.

Konda Surekha Visit

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళిక లేకుండా వరంగల్ జైలును కూలగొట్టిందన్నారు. ఆస్పత్రి పేరుతో భవనాలు నిర్మించి… ఎంజీఎంకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. అప్పు తెచ్చి డబ్బు వృధా చేశారని విమర్శించారు. ఎవరైన ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు త్వరలోనే బయటకు తీస్తామన్నారు. ఎంజీఎం ఆసుపత్రి ని అన్ని రకాలుగా తీర్చిదిద్దుతామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

Also Read : Congress First List: 39 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల !

Leave A Reply

Your Email Id will not be published!