Koo App Record : ట్విట్టర్ బేజార్ ‘కూ’ దూకుడు
తాజాగా బ్రెజిల్ లో లాంచ్
Koo App Record : సామాజిక మాధ్యమాలలో టాప్ లో కొనసాగుతున్న ట్విట్టర్ ఇప్పుడు ఒడిదుడుకులకు లోనవుతోంది. టెస్లా చైర్మన్ ఎలాన్ మస్క్ టేకోవర్ చేసుకున్నాక దాని పనితీరు దారుణంగా పడి పోతోంది. భారీ ఎత్తున రూ. 4,400 కోట్లకు దక్కించుకున్న మస్క్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
కానీ వర్కవుట్ కావడం లేదు. ప్రధానంగా ఖర్చు తగ్గించు కోవడంలో భాగంగా ఇప్పటి వరకు పర్మినెంట్ ఉద్యోగులు 6,500 మందిని కాంట్రాక్టు కింద పని చేస్తున్న 5 వేల మందిని తొలగించాడు. ఆపై కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. ఇక నుంచి రిమోట్ నుంచి పని చేసేందుకు వీలు లేదన్నాడు.
ఇదే సమయంలో టాప్ పొజిషన్ లో ఉన్న వారందరినీ పీకేశాడు. ఆపై బోర్డు ఆఫ్ డైరెక్టర్లను తొలగించాడు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ ఒక్కడే అన్నీ చూసుకుంటున్నాడు. రోజు రోజుకు ట్విట్టర్ పై ఆసక్తి సన్నగిల్లుతోంది. ఇదే సమయంలో యూజర్లకు మరో కోలుకోలేని షాక్ ఇచ్చాడు మస్క్. బ్లూ టిక్ కలిగి ఉండాలంటే నెలకు రూ. 749 రూపాయలు చెల్లించాలని స్పష్టం చేశాడు.
ప్రస్తుతానికి దీనిని వాయిదా వేశాడు. ఈ తరుణంలో ట్విట్టర్ కంటే ప్రత్యామ్నాయంగా ఎన్నో సోషల్ మీడియా సంస్థలు ఉన్నా భారత దేశానికి చెందిన కూ – ను ఎక్కువగా(Koo App Record) ఆదరిస్తున్నారు. ప్రస్తుతం ఇది 11 భాషల్లో అందుబాటులో ఉంది. భారీ ఎత్తున దీనిలో పెట్టుబడులు పెడుతున్నారు.
ఇక ట్విట్టర్ కు ధీటుగా కూ యాప్ దుమ్ము రేపుతోంది. ఇతర దేశాలలో కూడా ఈ యాప్ ను లాంచ్ చేస్తున్నారు. బ్రెజిల్ లో రిలీజ్ చేసిన వెంటనే పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసుకున్నారు.
Also Read : తీసేయడం లేదు వాళ్లే వెళుతున్నారు