Kotha Manohar Reddy : టికెట్లు అమ్ముకుంటున్న రేవంత్
బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి
Kotha Manohar Reddy : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన సీనియర్ నేత కొత్త మనోహర్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డిపై(Revanth Reddy) నిప్పులు చెరిగారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్న వారి నుంచి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు కొత్త మనోహర్ రెడ్డి.
Kotha Manohar Reddy Shocking Comments on Revanth Reddy
తాజాగా కల్వకుర్తికి చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి నుంచి రూ.6 కోట్లు, గాలి అనిల్ కుమార్ వద్ద నుండి రూ. 12 కోట్లు తీసుకున్నాడని ఆరోపించారు. ఇటీవల మహేశ్వరం టికెట్ కోసం చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి దగ్గర రూ.10 కోట్లు, 5 ఎకరాల భూమి తీసుకున్నాడని ఆరోపణలు చేయడంతో కొత్త మనోహర్ రెడ్డిని పార్టీ నుండి బహిష్కరించారు.
అయినా ఆయన ఎక్కడా తగ్గడం లేదు. తాను చేసిన ఆరోపణలు తప్పని తేలాలంటే రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మ వారి దేవాలయం వద్దకు రావాలని, తాను డబ్బులు తీసుకోలేదంటూ ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. తాను సీఎం అవుతానని , రెవిన్యూ మినిష్టర్ పదవి ఇస్తానంటూ గాలి అనిల్ కుమార్ వద్ద కోట్లు తీసుకున్నాడంటూ ఆరోపించారు.
రేవంత్ రెడ్డి వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశానని చెప్పారు కొత్త మనోహర్ రెడ్డి.
Also Read : Bandaru Satyanarayana Comment : వ్యక్తిత్వ హననం జుగుస్సాకరం