KS Eshwarappa : కర్ణాటకలో కాంట్రాక్టర్ సూసైడ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఈ విషయంలో తన ప్రమేయం ఎంత మాత్రం లేదని, తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని చెబుతూ వచ్చిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై(KS Eshwarappa) కేసు నమోదైంది.
ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గాను సదరు మంత్రిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో మంత్రి కేఎస్ ఈశ్వరప్పతో పాటు ఆయన సహచరుల పేర్లు కూడా ఉన్నాయి.
కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఓ హోటల్ లో సూసైడ్ చేసుకున్నారు. దీంతో సంతోష్ పాటిల్ సోదరుడు ప్రశాంత్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈశ్వరప్పతో పాటు సహచరులు బసవరాజ్ , రమేష్ ల పేర్లు కూడా ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో తాను చేపట్టిన రూ. 4 కోట్ల పనుల్లో మంత్రి సహచరులు 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారంటూ మృతుడు సంతోష్ పాటిల్ తాను రాసిన సూసైడ్ నోట్ లో రాశారు.
ఉడిపి లోని ఓ ప్రైవేట్ లాడ్జిలో శవమై కనిపించడం కలకలం రేగింది. తన మరణానికి మంత్రి కేఎస్ ఈశ్వరప్ప(KS Eshwarappa), అతని అనుచరులే కారణమంటూ నోట్ లో పేర్కొన్నాడు.
తన చావుకు ఈశ్వరప్పే కారణమని , తన ఆశయాలను పక్కన పెట్టి నిర్ణయం తీసుకుంటున్నానని తెలిపాడు. ప్రధాని, లింగాయత్ నేత బీఎస్ యడ్యూరప్ప తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరాడు. ఈ ఘటనపై ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు సీఎం బసవరాజ్ బొమ్మై.
Also Read : యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోష్ మోదీకి షాక్