KT Ramarao: ఎల్‌ఆర్‌ఎస్ అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ !
ఎల్‌ఆర్‌ఎస్ అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ !
KT Ramarao: లేఅవుట్ క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్- 2020 పథకంను ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగా అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KT Ramarao) లేఖ రాశారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలని ఆ లేఖలో ఆయన డిమాండ్ చేసారు. గతంలో మీతో సహా, మీ సహచర మంత్రులు చెప్పిన మాటలు, హామీలను దృష్టిలో ఉంచుకొని ఉచితంగా ఎల్ఆర్ఎస్‌ను అమలు చేయాలని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాదు గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు, ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు ప్రజలను క్షమాపణ కోరాలని కేటీఆర్ ఆ లేఖలో డిమాండ్ చేశారు.
KT Ramarao Letter to…
ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న మీరు… ఈరోజు ప్రజలనెందుకు దోపిడీ చేస్తున్నారో వివరించాలనీ డిమాండ్ చేస్తున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల డిమాండ్ ను, మా నిరసన కార్యక్రమం, వినతి పత్రాల రూపంలో మీ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ప్రజల ఆకాంక్షల మేరకు డిమాండ్ మేరకు ఉచితంగా ఎల్ఆర్ఎస్‌ను అమలు చేయాలని ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేయాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని మీరు అసెంబ్లీలో చెప్పిన మాట వాస్తవమే అయితే వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలి’’ అని లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) కింద దరఖాస్తు చేసుకున్న ఎంతోమంది గత మూడున్నరేళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నారు. నగర, పురపాలికలు, పంచాయతీల పరిధిలో అక్రమ లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 25 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఔట్ లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 31లోపు దరఖాస్తుదారులకు ఈ అవకాశం కల్పించనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ 25 లక్షల దరఖాస్తులకు మోక్షం కలగనుంది. ఈ నిర్ణయం వనల అనధికారిక అంచనాల ప్రకారం అందిన దరఖాస్తుల్లో అర్హమైన వాటిని క్రమబద్ధీకరించడం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
Also Read : Arun Goel: కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా !