KTR Davos WEF : ప్రపంచ ఆర్థిక సదస్సులో కేటీఆర్
పెట్టుబడుల ఆకర్షణకు వెళ్లిన మంత్రి
KTR Davos WEF : స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ) కు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యేందుకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు ప్రతినిధులు కూడా ఉన్నారు. గతంలో కూడా మంత్రి హాజరయ్యారు. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ జనవరి 16 నుంచి 20 వరకు జరగనుంది.
ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఇప్పటికే దావోస్ కు చేరుకున్న కేటీఆర్(KTR Davos WEF) రాష్ట్రానికి సంబంధించిన విజన్ ను ఈ సందర్భంగా వివరించనున్నారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఈ సదస్సు అత్యధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
డబ్ల్యూఈఎఫ్ ఆధ్వర్యంలో జరిగే ఇండస్ట్రీ రౌండ్ టేబుల్స్ లో కూడా కేటీఆర్ పాల్గొంటారు. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి సంస్థలకు పెట్టుబడి పెట్టేందుకు గమ్య స్థానంగా ప్రదర్శించడం, ప్రైవేట్ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు కేటీఆర్.
తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రగతి శీల , పరిశ్రమ అనుకూల విధానాలను ఏ విధంగా ప్రయారిటీ ఇస్తుందోననే దానిపై కేటీఆర్ వివరించనున్నారు. టెక్నాలజీ పవర్ హౌస్ గా మార్చడంలో తెలంగాణ సర్కార్ చేస్తున్న పాత్రను ఈ సందర్భంగా కొనియాడారు డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే .
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు తెలంగాణ నుంచి ఐదుసార్లు ప్రతినిధి బృందం పాల్గొనడం డబ్ల్యూఈఎఫ్ లో. 2018లో, 2019, 2020, 2022లో పాటు ప్రస్తుతం 2023లో పాల్గొంటున్నారు కేటీఆర్.
Also Read : భారత్ లో పెరిగిన బిలియనీర్లు