KTR : ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ 68వ పుట్టిన రోజు. దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున గ్రీటింగ్స్ తెలియ చేస్తున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ తనయుడు, ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
తనకు తన తండ్రి కేసీఆర్ ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నానని తెలిపారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే అలవాటుగా మార్చుకున్న అరుదైన నాయకుడు అని కొనియాడు.
సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే దమ్మున్న లీడర్. బహుభాషా కోవిదుడే కాదు మనసున్నోడు అని ప్రశంసించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ముందుకే నడిచిన నాయకుడు తన తండ్రి అని అన్నారు.
దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే సత్తా కలిగిన ఏకైక నాయకుకు కేసీఆర్. నాకు తండ్రి అయినందుకు గర్వంగా ఉంది. మళ్లీ జన్మంటూ ఉంటే ఆయనే తనకు తండ్రి కావాలని కోరుకుంటున్నానని. జీవితాంతం ఆయురారోగ్యంగా ఉండాలని, ఇలాగే కలకాలం ఆనందంగా, సంతోషంగా జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్తిస్తున్నానని తెలిపారు.
ఒకానొక సమయంలో కేటీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనను అత్యంత ప్రభావితం చేసిన అరుదైన వ్యక్తి తన తండ్రేనంటూ స్పష్టం చేశారు.
ఆయన కవి, రచయిత, గాయకుడు, నాయకుడు, భావుకుడు, దిశా నిర్దేశం చేసే నాయకుడు, స్పూర్తి ప్రదాత. అంతకు మించి గొప్ప తండ్రి. ఇంతకన్నా ఇంకేం చెప్పలేనంటూ ప్రతి అడుగులో, ప్రతి దారుల్లో కేసీఆర్ ప్రభావం, ముద్ర తప్పక ఉంటుందని పేర్కొన్నారు.
Also Read : మోదీకి ఛాన్స్ ఇస్తే అమ్మడం ఖాయం