KTR Slams : మీ సీఎం అభ్యర్థులు ఎవరో చెప్పండి
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కేటీఆర్ సవాల్
KTR Slams : తెలంగాణలో నేతల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. నువ్వా నేనా అన్నంతగా ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ , బీజేపీలను టార్గెట్ చేశారు. ఆయా పార్టీలకు జెండాలు తప్పా ఎజెండాలు ఏవీ లేవంటూ మండిపడ్డారు. తమ పార్టీని ఎదుర్కొనే సత్తా ఆ పార్టీలకు లేనే లేదన్నారు. ఆయా పార్టీలకు నేతృత్వం వహిస్తున్న వారికి ఓ విజన్ అంటూ లేదన్నారు. వీళ్లు తమ పార్టీని పదే పదే విమర్శించడం తనకు నవ్వు కలిగిస్తుందన్నారు.
ముందు దమ్ముంటే కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరో ప్రకటించాలని సవాల్ విసిరారు. బండి సంజయ్ , రేవంత్ రెడ్డి ఊహల్లో తేలి పోతున్నారని ఒక పార్టీకి క్యాడర్ లేదని ఇంకో పార్టీకి ఒకరంటే మరొకరికి పడదని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా ఏ పార్టీకి లేనంతటి క్యాడర్ ఒక్క భారత రాష్ట్ర సమితికి మాత్రమే ఉందన్నారు కేటీఆర్. అవాకులు , చెవాకులు పేల్చుతూ తమంతకు తాము గొప్ప నాయకులమని విర్ర వీగుతున్నారని ప్రజలు మరోసారి బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు కేటీఆర్.
ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. తాము రాబోయే ఎన్నికల్లో పక్కా 100 సీట్లు గెలుస్తామన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ముచ్చటగా మూడోసారి సీఎంగా కేసీఆర్ అవుతారని రాసి పెట్టుకోండి అంటూ స్పష్టం చేశారు కేటీఆర్.
Also Read : Anurag Thakur