KTR : అభ్యర్థులకు కంగ్రాట్స్..రానోళ్లకు తప్పక ఛాన్స్
ట్విట్టర్ వేదికగా ఐటీ మంత్రి కేటీఆర్
KTR : ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ప్రగతి భవన్ వేదికగా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. మొత్తం 119 స్థానాలకు గాను ఏడుగురు సిట్టింగ్ లను మార్చారు. 4 స్థానాలను పెండింగ్ లో పెట్టారు. ఇక పార్టీ తరపున 115 సీట్లకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానంలో ఉన్న మంత్రి కేటీఆర్(KTR) ట్విట్టర్ వేదికగా స్పందించారు.
KTR Congratulates
ఎంపికైన అభ్యర్థులకు ముందస్తుగా శుభాభినందనలు తెలిపారు. ఇదే సమయంలో సీట్లు రాని అభ్యర్థుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారికి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దృష్టిలో ఉన్న వారికి తప్పకుండా అవకాశాలు ఇచ్చి తీరుతారని స్పష్టం చేశారు కేటీఆర్.
అలాగే తనను సిరిసిల్ల నుండి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు పార్టీ చీఫ్ , సీఎం కేసీఆర్ కు ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజా జీవితంలో కొన్ని ఇబ్బందులు తప్పవన్నారు. అందరినీ సంతృప్తి పర్చలేమని పేర్కొన్నారు కేటీఆర్.
Also Read : CM KCR MIM : ఎంఐఎంతో బీఆర్ఎస్ దోస్తానా – సీఎం