KTR & Tejashwi Yadav : డియ‌ర్ బ్ర‌ద‌ర్ కంగ్రాట్స్ – కేటీఆర్

పాల‌నా ప‌రంగా ప‌రిణ‌తి సాధించాలి

KTR &  Tejashwi Yadav : బీహార్ రాష్ట్ర రాజ‌కీయాల‌లో స‌రికొత్త అధ్యాయం చోటు చేసుకుంది. యువ నాయ‌కుడిగా పేరొందారు మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ త‌న‌యుడు తేజ‌స్వి యాద‌వ్.

గ‌త కొంత కాలం నుండి అత‌డు ప‌రిణ‌తి చెందిన నాయ‌కుడిగా ఎదిగారు. ప్ర‌ధానంగా ప్ర‌భుత్వంపై ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం నిల‌దీశాడు. ఆపై నిరుద్యోగ స‌మ‌స్య‌ను ఎక్కువ‌గా ప్ర‌స్తావించారు.

వారి కోసం నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. ఏ ప్ర‌భుత్వంపైన తాను పోరాటం చేశాడో అదే స‌ర్కార్ లో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కొలువు తీరాడు తేజ‌స్వి యాద‌వ్. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు.

జేడీయూ, బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ కూలి పోయింది. నితీశ్ కుమార్ 17 ఏళ్ల బీజేపీ బంధానికి క‌టీఫ్ చెప్పారు. ఆ వెంట‌నే ఆర్జీడీ, కాంగ్రెస్, ఇత‌ర పక్షాల‌తో క‌లిసి మ‌హా కూట‌మిని ఏర్పాటు చేశాడు.

తేజ‌స్వి యాద‌వ్ కు అనుకోని రీతిలో ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇచ్చాడు. దీంతో ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు.

కేవ‌లం నెల లోనే భారీ ఎత్తున ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించాడు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎంగా కొలువు తీరిన తేజ‌స్వి యాద‌వ్ కు దేశ వ్యాప్తంగా ప‌లువురు నేత‌లు అభినంద‌న‌లు తెలియ చేస్తున్నారు.

వారిలో మొద‌ట‌గా స్పందించింది మాత్రం తెలంగాణ యువ నేత‌, సీఎం కేసీఆర్ త‌న‌యుడు, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్. డియ‌ర్ బ్ర‌ద‌ర్ తేజ‌స్వి యాద‌వ్ కంగ్రాట్స్(KTR &  Tejashwi Yadav). మ‌రింత‌గా ఉన్న‌తంగా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపాడు.

ఇటీవ‌లే తేజ‌స్వి యాద‌వ్ తెలంగాణ‌కు వ‌చ్చారు.

Also Read : నాలుగు రోజులు ఆగితే తెలుస్తుంది

Leave A Reply

Your Email Id will not be published!