KTR Davos : టెక్నాలజీ విప్లవం జాగ్రత్త అవసరం
స్పష్టం చేసిన ఐటీ మంత్రి కేటీఆర్
KTR Davos : ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని టెక్నాలజీ శాసిస్తోంది. అదే సమయంలో దీని వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయో అంత కంటే ఎక్కువగా నష్టం కలిగించేందుకు వీలుందని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు తెలంగాణ ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR Davos).
స్విట్జర్లాండ్ లోని దావోస్(KTR Davos) లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ప్రజలు నమ్మితే దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు.
అయితే ఈ విషయంలో ప్రభుత్వ వ్యవస్థలపై మరింత విశ్వాసం కలిగించాలని సూచించారు. గతంలో కంటే ప్రస్తుతం టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది.
ప్రధానంగా ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ హైదరాబాద్ ను ఎంపిక చేసుకుంటున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్ , బ్లాక్ చైన్ , డాటా సైన్సెస్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు ఎంత ఉయోగకరమో అంత ప్రమాదకరమని హెచ్చరించారు.
వీటి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు కేటీఆర్(KTR Davos). ప్రత్యేకించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు టెక్నాలజీ వినియోగంతో కలిగే మంచి చెడులతో పాటు లాభ, నష్టాలపై పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు.
ఏఐ ఆన్ ది స్ట్రీట్ మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ది పబ్లిక్ స్క్వేర్ అనే అంశంపై కేటీఆర్ పాల్గొన్నారు. డేటా భద్రతపై నిఘా ఉండాలన్నారు.
సరైన పద్దతుల్లో వాడినట్లియితే సత్ఫలితాలు వస్తాయని అన్నారు కేటీఆర్. లేక పోతే తీవ్ర దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు.
Also Read : లైఫ్ సైన్సెస్ లో సంస్కరణలు అవసరం