KTR : నిన్న మోదీ ఇవాళ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పొంతనలేని కామెంట్స్ చేశారు. ఆపై అభాసు పాలయ్యారు. పెట్రోల్ , డీజిల్ పై ఆయా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని కోరానని పట్టించు కోలేదంటూ ప్రధాని మోదీ కామెంట్ చేయడం కలకలం రేగింది.
ఈ తరుణంలో బీజేపీయేతర రాష్ట్రాలన్నీ భగ్గుమన్నాయి. కేంద్రానికి చిత్తశుద్ది లేకనే ఇలా అంటోందంటూ మండిపడ్డాయి. ధరలు తగ్గించాల్సింది కేంద్రమే కానీ రాష్ట్రాలు కావన్న సంగతి పీఎంకు తెలియక పోవడం విడ్డూరంగా ఉందంటూ కామెంట్ చేశాయి.
తాజాగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ఐటీ , పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR). 2014 నుంచి 2021 దాకా రూ. 56, 020 కోట్లు వ్యాట్ రూపేణా వసూలు చేసిందంటూ ఆరోపించారు.
దీనిపై మంత్రి సీరియస్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈరోజు వరకు ఒక్క పైసా వ్యాట్ పెంచలేదని స్పష్టం చేశారు. విషయం అర్థం చేసుకోకుండా , ఆధారాలు లేకుండా కేంద్ర మంత్రి మాట్లాడటం మంచి పద్దతి కాదని హితవు పలికారు కేటీఆర్(KTR).
2014లో క్రూడాయిల్ ధర 105 డాలర్లు ఉన్న సమయంలో పెట్రోల్ ధర రూ. 70 గా ఉందని ఇప్పుడు కూడా అదే ధరకు క్రూడాయిల్ దొరుకుతోందని ఎందుకు పెట్రోల్ ధర పెరిగిందో మంత్రి, ప్రధాని చెప్పాలన్నారు.
ఎలా పెరిగిందో, ఎందుకు పెంచామో ముందు దేశానికి సమాధానం చెప్పాలని, ఆ బాధ్యత మీపై ఉందన్నారు. సొల్లు కబుర్లు చెప్పడం ఆపి ఎలా ధరలు తగ్గించాలో ఆలోచించాలని పేర్కొన్నారు కేటీఆర్.
Also Read : గవర్నర్ వ్యవస్థ దారుణంగా తయారైంది