KTR Harish Rao : బావ‌కు మ‌ద్ద‌తు తెలిపిన బామ్మ‌ర్ది

మైనంప‌ల్లి కామెంట్స్ పై కేటీఆర్ ఫైర్

KTR Harish Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత్ రావు నిప్పులు చెరిగారు. ఆయ‌న ఆర్థిక , ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అంతు తేలుస్తానంటూ హెచ్చ‌రించారు. ఒక‌ప్పుడు కాళ్ల‌కు చెప్పులు లేని నువ్వు ఇవాళ ల‌క్ష కోట్ల‌కు ఎలా ఎదిగావో చెప్పాల‌ని నిల‌దీశారు. త‌న కొడుక్కి టికెట్ ఇవ్వ‌కుండా అడ్డుకున్నాడంటూ ఆరోపించారు. ఆయ‌న త‌న త‌న‌యుడితో క‌లిసి తిరుమ‌ల‌కు వెళ్లారు. వెంక‌న్న సాక్షిగా కేవ‌లం హ‌రీశ్ ను టార్గెట్ చేస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేయడం క‌ల‌క‌లం రేపింది.

KTR Harish Rao Viral

విచిత్రం ఏమిటంటే ఇవాళ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన జాబితాలో త‌న పేరు కూడా ఉంది. కానీ త‌న కొడుక్కి టికెట్ రాక పోవ‌డంపై ఆయ‌న బ‌ర‌స్ట్ అయ్యాడు. నోరు జారారు. విచిత్రం ఏమిటంటే ప‌విత్ర‌స్థ‌లం సాక్షిగా కామెంట్స్ చేయ‌డాన్ని భ‌క్తులు త‌ప్పు ప‌డుతున్నారు.

మ‌రో వైపు విదేశాల్లో ఉన్న మంత్రి కేటీఆర్(KTR) ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు()పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎవ‌రైనా స‌రే పార్టీ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉండాల‌న్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. త‌న బావ హ‌రీశ్ రావు తెలంగాణ ఉద్య‌మం లో కీల‌కంగా ప‌ని చేశాడ‌ని పేర్కొన్నారు. ఇవాళ బీఆర్ఎస్ లో మూల స్తంభ‌మ‌న్నారు. బావ‌ను అంటే ఊరుకోనన్నారు బావ‌మ‌రిది కేటీఆర్.

Also Read : Sanju Samson Back Up : సంజూ శాంస‌న్ బ్యాక‌ప్ ప్లేయ‌రా

Leave A Reply

Your Email Id will not be published!