KTR in Auto: ఆటోలో ప్రయాణించిన కేటీఆర్
ఆటోలో ప్రయాణించిన కేటీఆర్
KTR in Auto: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) శనివారం ఉదయం ఆటోలో ప్రయాణించారు. యూసుఫ్ గూడలో నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన… బయటకు వచ్చిన అనంతరం తన కారులో కాకుండా రోడ్డుపై ఓ ఆటో ఎక్కారు. యూసుఫ్ గూడ నుంచి జూబ్లీహిల్స్ లోని తెలంగాణ భవన్ వరకు ప్రయాణించింన కేటీఆర్… ఈ సమయంలో ఆటో డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
KTR in Auto Viral
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడంతో తమ పరిస్థితి దుర్భరంగా మారిందని తెలిపారు. ‘బస్సుల్లో మాదిరీగా ఆటోల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి… ఆ మేరకు ఆటో చార్జీలను ప్రభుత్వం మాకు డబ్బులు చెల్లించేలా చూడాలి’ అని ఆటోడ్రైవర్ ఆయన్ను కోరినట్లు తెలుస్తోంది. ఇంతలోనే తెలంగాణా భవన్ వద్దకు చేరుకున్న కేటీఆర్(KTR)… ఆటో డ్రైవర్ కు ఛార్జీ చెల్లించారు. కేటీఆర్ వెంట మ్మెల్యే మాగంటి గోపీనాథ్, మైనార్టీ విభాగం నాయకుడు షేక్ అబ్దుల్లా సొహైల్ ఉండగా… వెనుక ఆటోలో కేటీఆర్ భద్రతా సిబ్బంది వెళ్ళాల్సి వచ్చింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్(KTR) మాట్లాడుతూ… “కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడంతో ఆటోవాలాల పరిస్థితి దుర్భరంగా మారిందని… కాబట్టి వారికి సంఘీభావంగా ఆటోలో ప్రయాణించానని వెల్లడించారు. ఈ సమయంలో డ్రైవర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడం ఆటోవాలాల జీవితాన్ని తలకిందులు చేసిందన్నారు. వారి డిమాండ్లు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. దావోస్ లాంటి విదేశీ పర్యటనలు, తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు, టెక్ ప్రతినిధులతో పెట్టుబడుల కోసం గత తొమ్మిదిన్నరేళ్లు టైమ్ కేటాయించిన కేటీఆర్… ప్రతిపక్షంలోనికి రాగానే ఒక్కసారిగా ఆటోలో ప్రయాణించడం హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ ఆటోలో ప్రయాణించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Also Read : Kerala CM: కేరళ గవర్నర్ పై సీఎం ఆగ్రహం !