KTR : కేటీఆర్ కు డ‌బ్ల్యూటీఎఫ్ ఆహ్వానం

మీ విజ‌యాలు వినేందుకు స్వాగ‌తం

KTR : దేశానికే ఆద‌ర్శంగా మారింది తెలంగాణ‌. అన్ని రంగాల‌లో ముందంజ‌లో ఉంది. భిన్న‌మైన రీతిలో పాల‌న‌ను కొన‌సాగిస్తోంది. ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా మారింది. ఇందుకు సంబంధించి ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR) కు రావాలంటూ ప్రంప‌చ ఆర్థిక వేదిక (డ‌బ్ల్యూటీఎఫ్) ఆహ్వానించింది.

ఈ స‌ద‌ర్భంగా మీరు సాధించిన విజ‌యాల‌ను వినేందుకు యావ‌త్ ప్ర‌పంచం ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తోంద‌ని తెలిపారు డ‌బ్ల్యూఈఎఫ్ చీఫ్ బోర్గే. రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ది, ఆవిష్క‌ర‌ణ‌లు, డిజిట‌ల్ వినియోగం, టీ, వీ హ‌బ్ ల ఏర్పాటు, స్టార్ట‌ప్ ల పురోభివృద్ది, టెక్నాల‌జీ వినియోగం , ఐటీ కంపెనీల ఏర్పాటు అద్భుతంగా కొన‌సాగుతోంద‌ని కితాబు ఇచ్చారు.

ఇందులో భాగంగా చైనా లోని టియాంజిన్ లో జూన్ 27 నుంచి 29 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది 14వ ప్ర‌పంచ ఆర్థిక వేదిక‌. ఈ వార్షిక స‌ద‌స్సులో పాల్గొనాల‌ని మంత్రి కేటీఆర్ కు స్వ‌యంగా లేఖ రాశారు. బోర్గే త‌న‌ను ప్ర‌త్యేకంగా అభినందించ‌డ‌మే కాకుండా ప్ర‌పంచ ఆర్థిక స‌దస్సులో పాల్గొనాలంటూ ఆహ్వానించ‌డం త‌న‌ను సంతోషానికి గురి చేసింద‌ని కేటీఆర్ తెలిపారు . ఈ మేర‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇది త‌మ ప్ర‌భుత్వ ప‌నితీరుకు ద‌క్కిన గౌర‌వ‌మ‌ని పేర్కొన్నారు మంత్రి.

Also Read : మీ బిడ్డ‌లైతే ఇలాగే చేస్తారా – శ్రీ‌నివాస్ గౌడ్

Leave A Reply

Your Email Id will not be published!