KTR ISB : సివిల్స్ సులభం పాలిటిక్స్ కష్టం
ఐటీ మంత్రి కె.తారక రామారావు
KTR ISB : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షలు అందరూ చాలా కష్టమని అనుకుంటారు కానీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టిలో మాత్రం చాలా సులభమని చెప్పడం విస్తు పోయేలా చేసింది. మొహాలీ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
KTR ISB – Words on Politics
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయడం చాలా సులభంగా మారిందని కానీ రాజకీయాల్లో రాణించడం మాత్రం రాణించాలంటే నానా తంటాలు పడాల్సి వస్తోందని ఆవేదన చెందారు. ఒక రకంగా సివిల్స్ పరీక్షల కంటే పాలిటిక్స్ పరీక్షలు ప్రమాదకరమని పేర్కొన్నారు కేటీఆర్(KTR). తెలంగాణ సాధించిన ప్రగతిని, తన అనుభవాలను పంచుకున్నారు.
రాజకీయాల్లోకి రావాలని అనుకున్న వాళ్లకు దానిని ఓ కెరీర్ గా చూడ కూడదన్నారు. కానీ సామాజిక సేవ చేయాలంటే మాత్రం ఇదే మంచి ఆప్షన్ అని స్పష్టం చేశారు కేటీఆర్. 5 ఏళ్ల పాటు పార్టీ కోసం పని చేయండి. ఆ తర్వాత పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. ఇవాళ దేశంలో రాజకీయాలు అత్యంత సామాన్యులతో నిండి పోయి ఉన్నాయని పేర్కొన్నారు కేటీఆర్.
ప్రస్తుతం మణిపూర్ మండుతోంది. దానిని చూసినప్పుడుల్లా తాను ఆవేదన చెందుతున్నానని తెలిపారు. గ్రామీణ , పట్టణాభివృద్దికి దోహద పడిన కార్యక్రమాలు, తెలంగాణ అభివృద్ది నమూనా , తదితర అంశాలను మంత్రి వివరించారు.
Also Read : Komati Reddy Venkat Reddy : చెల్లీ షర్మిల రామ్మా – కోమటిరెడ్డి