Jailer Collections : కాసుల వేట‌లో త‌లైవా జైల‌ర్

త‌లైవా ర‌జ‌నీకాంత్ మూవీ సూప‌ర్

Jailer Collections : నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జైల‌ర్ చిత్రం దుమ్ము రేపుతోంది. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. 72 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చినా త‌లైవా ర‌జ‌నీకాంత్ త‌న స్టామినా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించారు. ప్ర‌ధానంగా అన్నీ తానై వ్య‌వ‌హ‌రించాడు ఈ చిత్రంలో. ఇక త‌మ‌న్నా భాటియా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఆగ‌స్టు 10న వ‌ర‌ల్డ్ వైడ్ గా మూవీ మేక‌ర్స్ జైల‌ర్ చిత్రాన్ని విడుద‌ల చేశారు.

Jailer Collections Raining

తొలి రోజు ఒక్క త‌మిళ‌నాడులో రూ.29.46 కోట్లు వ‌సూలు చేసింది. రెండో రోజు రూ. 20.25 కోట్లు కొల్ల‌గొట్టింది. మొత్తంగా రెండు రోజుల‌కు గాను జైల‌ర్(Jailer) మూవీ క‌లెక్ష‌న్స్ 49.71 కోట్లు వ‌సూలు చేయ‌డం విస్తు పోయేలా చేసింది. చిత్రాన్ని క‌ళానిధి మార‌న్ నిర్మించారు.

ర‌జ‌నీ కాంత్ , త‌మ‌న్నా భాటియాతో పాటు ర‌మ్య కృష్ణ‌, ప్రియాంకా అరుళ్ మోహ‌న్ , యోగి బాబు, శివ రాజ్ కుమార్, మోహ‌న్ లాల్ ప్ర‌త్యేక పాత్ర‌లలో న‌టించి మెప్పించారు. ఛాయా గ్ర‌హ‌ణం విజ‌య్ కార్తీక్ క‌న్న‌న్ చేప‌డితే సంగీతం అనిరుధ్ ర‌విచంద‌ర్ అందించారు. స‌న్ పిక్చ‌ర్స్ దీనిని స‌మ‌ర్పించింది. ఇక ర‌జ‌నీకాంత్ కెరీర్ లో జైల‌ర్ 109వ చిత్రం కావ‌డం విశేషం.

విడుద‌లైన కొద్ది సేప‌టికి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. త‌ర్వాత తిరిగి పాజిటివ్ టాక్ అందుకుంది జైల‌ర్ చిత్రం. మొత్తంగా మ‌రోసారి ర‌జ‌నీకాంత్ త‌న స‌త్తా ఏమిటో చూపించాడు.

Also Read : KTR ISB : సివిల్స్ సుల‌భం పాలిటిక్స్ కష్టం

Leave A Reply

Your Email Id will not be published!