Atchannaidu : చంద్ర‌బాబును మించిన లీడ‌ర్ లేడు

కింజార‌పు అచ్చెన్నాయుడు కామెంట్

Atchannaidu : టీడీపీ సీనియ‌ర్ నేత కింజార‌పు అచ్చెన్నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేశారు. బాబును మించిన నాయ‌కుడు లేడ‌న్నారు. ఆయ‌న ప‌వ‌ర్ లో ఉన్నా లేకున్నా ఒకేలాగా ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు. వ‌య‌సు మించి పోతున్నా జ‌గ‌న్ రెడ్డి హ‌యాంలో ఏపీ విధ్వంసానికి గుర‌వుతుండ‌డాన్ని త‌ట్టుకోలేక తిరిగి ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చార‌ని పేర్కొన్నారు.

Atchannaidu Words About Chandrababu Naidu

బాబుకు 72 ఏళ్లు వ‌చ్చినా ఇంకా న‌వ యువ‌కుడి లాగానే ప‌ని చేస్తున్నార‌ని కితాబు ఇచ్చారు. ప‌సి కూన ఆంధ్ర ప్ర‌దేశ్ ను ప్ర‌గ‌తి ప‌థంలో న‌డిపించిన అరుదైన నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు అని ప్ర‌శంసించారు అచ్చెన్నాయుడు(Atchannaidu). రాష్ట్రం కోసం రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డార‌ని అన్నారు. 2019లో ప్ర‌జ‌ల తీర్పు భిన్నంగా ఉండ‌డంతో ఏపీ ప్ర‌స్తుతం గాడి త‌ప్పింద‌న్నారు. ఒక‌వేళ బాబుకు ప‌ట్టం క‌ట్టి ఉంటే ఇవాళ ఏపీ అప్పుల కుప్ప‌గా ఉండేది కాద‌న్నారు.

రాష్ట్రాన్ని దివాళా తీయించిన ఘ‌న‌త ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ద‌క్కుతుంద‌న్నారు. ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున చంద్ర‌బాబుకు స్పంద‌న ల‌భిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. రాబోయే రోజుల్లో చంద్ర‌బాబుకు జ‌నం ప‌ట్ట‌డం క‌ట్ట‌డం ఖాయ‌మ‌న్నారు కింజాపురం అచ్చెన్నాయుడు.

Also Read : Jailer Collections : కాసుల వేట‌లో త‌లైవా జైల‌ర్

Leave A Reply

Your Email Id will not be published!