Sri krishnajyothi Swaroopanda Swami Ji : యాగం జీవ‌న యోగం

శ్రీ‌శ్రీ‌శ్రీ కృష్ణ‌జ్యోతి స్వ‌రూపానంద స్వామీజీ

Sri krishnajyothi Swaroopanda Swami Ji : జీవితంలో కోరుకున్న‌ది ద‌క్కాల‌న్నా, అనుకున్న‌ది సాధించాల‌న్నా, ప్ర‌శాంతత కావాల‌న్నా ముందుగా కావాల్సింది ప్ర‌శాంతత‌. అది ఎక్క‌డో ఉంద‌ని ప్ర‌తి ఒక్క‌రూ వెదుకుతారు. వెంప‌ర్లాడ‌తారు. ఆశ‌లు, కోరిక‌ల‌తో, అపరిమిత‌మైన ఆతృత‌ను క‌లిగి ఉంటారు. కానీ వారు తెలుసుకోనిది ఏమిటంటే త‌మ‌ను తాము తెలుసుకోలేక పోవ‌డం. త‌మ‌ను తాము గుర్తించ‌క పోవ‌డం. అంటే అర్థం అంత‌రాత్మ ప్ర‌బోధాన్ని గుర్తించ‌క పోవ‌డం. ధ్యానం వ‌ల్ల మ‌న‌సు ఆందోళన నుంచి విముక్తి పొందుతుంది. యాగం వ‌ల్ల స‌మ‌స్త మాన‌వ స‌మాజం సేద దీరుతుంది. స్వాంత‌న పొందుతుంది. ఇదంతా ఎరుక‌తో రావాల్సిన అవ‌స‌రం. మ‌నంత‌కు మన‌మే తెలుసు కోవాలి. ఒక‌రు చెబితేనో లేదా ఇంకొక‌రు విశ్వ‌సిస్తేనో క‌లిగేది కాదు. యాగం జీవ‌న మార్గాన్ని నిర్దేశిస్తుంది. మ‌రింతగా చైత‌న్య‌వంతం పొందేలా , ప‌రిశుద్ద‌మయ్యేలా ఆస‌రాగా నిలుస్తుంది.

Sri krishnajyothi Swaroopanda Swami Ji Positive Words

ప్ర‌కృతి ప్ర‌సాదించిన గొప్ప సాధ‌నాల‌లో ధ్యానం, యాగం ముఖ్యం. వీటిని నిరంత‌రం సాధ‌న చేస్తూ ఉంటే ఎన‌లేని సంతోషం, ఆత్మ సంతృప్తి ద‌క్కుతుంది. దీనికి ఎలాంటి ఖ‌ర్చు ఉండ‌దు. కావాల్సింద‌ల్లా సంక‌ల్ప బ‌లం మాత్ర‌మే. ఏదీ ఊరికే రాదు..శోధిస్తేనే , శ్ర‌మిస్తేనే సాధ్య‌మ‌వుతుంది. ఈ ప‌విత్ర‌మైన నేల మీద ఎంద‌రో మ‌హానుభావులు, రుషులు, యోగులు న‌డ‌యాడారు. వారంద‌రు బోదించిన సారం ఒక్క‌టే. సాటి మ‌నుషుల ప‌ట్ల ద‌య‌, క‌రుణ‌, ప్రేమ క‌లిగి ఉండ‌డం. యాగ నిర్వ‌హ‌ణ ఎంతో క‌ష్టంతో కూడుకుని ఉంటుంది. దానికి చెక్కు చెద‌ర‌ని సంక‌ల్ప బ‌లం అవ‌స‌రం. దీనికి శ‌క్తివంచ‌న లేకుండా పాలు పంచుకుంటేనే నిజ‌మైన ఆధ్యాత్మిక లోగిలికి చేరుకోగ‌లం. దానిలో పాలు పంచుకుంటే కోల్పోయినవ‌న్నీ తిరిగి వ‌స్తాయి. అనుకున్న‌వ‌న్నీ సాధ్య‌ప‌డుతాయి. ఇది ఆచ‌ర‌ణ‌లో వెల్ల‌డైన వాస్త‌వం.

దీనిని గ‌మ‌నించి సేవ చేయ‌డం, సహాయ ప‌డ‌డం అన్న‌ది మ‌న దైనందిన జీవ‌న యానంలో భాగం కావాలి. అప్పుడే మ‌నిషి జ‌న్మ‌కు సార్థ‌క‌త చేకూరుతుంది. హిందూ ధ‌ర్మం, సంస్కృతి, నాగ‌రిక‌త బోధిస్తున్న‌ది ఇదే. శ్రీ‌కృష్ణ భ‌గ‌వానుడు బోధించిన సారం కూడా ఇదే. నీ ప‌ని నీవు చేసుకుంటూ వెళ్లు. ఫ‌లితం దానంత‌ట‌ అదే వ‌స్తుంది. ఇదే మార్గం. ఇదే అస‌లైన దారి. దీనిని గుర్తించాలంటే మ‌న‌సు స్వానుభ‌వంలో ఉండాలి. అప్పుడే క‌ష్టం ఇష్టంగా మారుతుంది. దారి త‌ప్పిన హృద‌యం స‌రైన స్థితిలోకి వ‌స్తుంది. యాగం లోక క‌ళ్యాణం కోసం. స‌మ‌స్త మాన‌వులంతా స‌మిష్టిగా సుఖ సంతోషాల‌తో, ఆయు రారోగ్యాల‌తో ఉండాల‌న్న‌దే సంక‌ల్పం. ఆ దిశ‌గా ప్ర‌తి ఒక్క‌రు కుల‌, మ‌తాల‌కు అతీతంగా ప్ర‌య‌త్నం చేయాంటారు శ్రీ‌శ్రీశ్రీ కృష్ణ‌జ్యోతి స్వ‌రూపానంద స్వామీజీ(Sri Krishnajyothi Swaroopanda Swami Ji). అవును కదూ.

Also Read : Atchannaidu : చంద్ర‌బాబును మించిన లీడ‌ర్ లేడు

Leave A Reply

Your Email Id will not be published!